Breaking News

వినికిడి లోపం ఉన్న వారికి అత్యాధునిక పరికరాలతో ఉన్నత వైద్యo

-జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో బెరా, ఇంపిడెన్స్, ప్యూర్ టోన్, ఆడియో మెట్రీ పరికరాల సిద్ధం
-సౌండ్ ప్రూప్ రూములు కూడా..
-సులువుగా వైకల్య నిర్ధారణ పరీక్షలు
-మంత్రి సత్యకుమార్ యాదవ్ కి నివేదించిన డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వినికిడి లోపం కలిగిన వారికి అత్యంత ఉన్నత వైద్యాన్ని కూటమి ప్రభుత్వం చేరువ చేస్తోంది. బెరా (brainstem evoked response audio metry -బ్రెయిన్ స్టెమ్ ఏవోక్డ్ రెస్పాన్స్ ఆడియో మెట్రీ), ఇంపిడెన్స్ (impedance) ఆడియో మెట్రీ, ప్యూర్ టోన్ (pure tone) ఆడియో మెట్రీ పరికరాలను అవసరమైన జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో సమకూరుస్తోంది. వినికిడి లోపం కలిగిన వారికి ఉన్నత వైద్యాన్ని అందించాలంటే ఈ మూడు రకాల పరికరాలు ఉండాలి. అయితే కొన్ని అసుపత్రుల్లో ఒకటి ఉంటే మరొకటి లేదు. మరికొన్నిచోట్ల అసలు లేవు. దీనివల్ల వినికిడి లోపం కలిగిన వారు ఉన్నత వైద్యం కోసం బోధనాసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలోని పరిస్థితులపై అధ్యయనం చేసి, రోగుల అవసరాల మేరకు పరికరాలను ఆసుపత్రుల్లో సమకూర్చేందుకు ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే సుమారు రూ.20 కోట్లతో బెరా, ఇంపిడెన్స్, ప్యూరోటోన్ ఆడియో మెట్రీ పరికరాలను స్థానిక అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రుల్లో సమకూరుస్తున్నారు అలాగే ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో సౌండ్ ప్రూఫ్ రూములను సైతం సిద్ధం చేస్తున్నారు. రోగులకు ఆసుపత్రుల్లో వీటిని అందుబాటులోనికి తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యలపై డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులు మంత్రి సత్యకుమార్ యాదవ్ కు నివేదించారు. వీటిని ఆసుపత్రుల్లో అందుబాటులోనికి తెచ్చే పనులు 80% వరకు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని మరో నెలలోగా సిద్ధంచేస్తామని వారు మంత్రికి వివరించారు. సదరం కింద జరిగే వైకల్య నిర్ధారణ పరీక్షలకు ఈ పరికరాలు బాగా ఉపయోగపడనున్నాయి. బాధితుల వినికిడి లోపాన్ని సూక్ష్మస్థాయిలో గుర్తించి సర్టిఫికెట్లు జారీ చేసేందుకు వీలవుతుంది

8 ఆసుపత్రుల్లో తొలిసారిగా మూడు పరికరాలు సిద్ధం!

తెనాలి జిల్లా ఆసుపత్రి, నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా), పాలకొండ (మన్యం), డోన్ (నంద్యాల), కందుకూరు (ప్రకాశం), కావలి (నెల్లూరు జిల్లా), చీపురుపల్లి (విజయనగరం), నర్సాపురం (పశ్చిమగోదావరి)లోని ఏరియా అసుపత్రుల్లో బెరా, ఇంపిడెన్స్, ప్యూర్ టోన్ ఆడియో మెట్రీ పరికరాలను అమర్చే పనులు ముగింపునకు వచ్చాయి

5 జిల్లా ఆసుపత్రులు, 34 ఏరియా ఆసుపత్రుల్లో రెండు వరికరాల చొప్పున!!

అనకాపల్లి, ప్రొద్దుటూరు, చిత్తూరు, ఆత్మకూరు, తణుకు జిల్లా ఆసుపత్రుల్లో బెరా, ప్యూర్ టోన్ ఆడియో మెట్రీ పరికరాలను అమర్చారు. అలాగే కుప్పం, ధర్మవరం ఏరియా ఆసుపత్రులు, జంగారెడ్డిగూడెం, అమలాపురం, చిలకలూరిపేట, శ్రీకాళహస్తి, అరకు, చింతపల్లి, రంపచోడవరం, చింతలపూడి, రామచంద్రాపురం, ఎస్ కోట, ఇతర ఏరియా ఆసుపత్రుల్లో తొలిసారిగా బెరా, ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ పరికరాలను అందుబాటులోనికి తెచ్చే చర్యలు తుది దశలో ఉన్నాయి.

6 జిల్లా ఆసుపత్రులు, కొన్ని ఏరియా ఆసుపత్రులకు ఇంపిడెన్స్ ఆడియో మెట్రీ పరికరాలు!

తెనాలి, అనకాపల్లి, చిత్తూరు, ప్రొద్దుటూరు, తణుకు, ఆత్మకూరు జిల్లా ఆసుపత్రులకు ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ పరికరాలను అమర్చేశారు. ఇవికాకుండా. రాయచోటి, పుంగనూరు, నగరి, జమ్మలమడుగు, సాలూరు, గిద్దలూరు, కదిరి, ఇతర అసుపత్రులకు ఇంపిడెన్సీ ఆడియో మెట్రీ పరికరాలు వెళ్లాయి.

10 ఆసుపత్రుల్లో సౌండ్ ప్రూప్ రూములు!

తెనాలి జిల్లా ఆసుపత్రి, పాలకొండ, గజపతినగరం, నరసాపురం, పాలకొల్లు, కందుకూరు, బనగానపల్లి, దోన్, కావలి, నర్సీపట్న ఏరియా ఆసుపత్రుల్లో కొత్తగా సౌండ్ ప్రూప్ రూములు సిద్దమౌతున్నాయి. వీటి ద్వారా సదరం వైద్య శిబిరాల ద్వారా వినికిడి లోపం కలిగిన వారిని గుర్తించడం మరింత సులువు అవుతుంది.

పరికరాల వల్ల ఉపయోగాలిలా..
– బెరా పరికరం ద్వారా వినికిడి లోపంతో పుట్టిన శిశువులకు సమస్య ఏ స్థాయిలో ఉందో గుర్తించేందుకు వీలవుతుంది. సమస్య సూక్ష్మస్థాయిలో ఏ స్థాయిలో ఉన్నప్పటికీ బెరా పరికరం ద్వారా గుర్తిస్తారు చెవుల్లో అంతర్గతంగా కణితులు ఉన్నట్లయితే బెరా పరికరం ద్వారా తెలుసుకుంటారు. రెండు చెవులను ఒకేసారి పరీక్షించేందుకు కూడా వీలవుతుంది. నొప్పి లేకుండా సురక్షిత విధానంలో ఈ పరీక్ష ఉంటుంది.

* ఆడియోమెట్రీ పరికరం ద్వారా నరాల బలహీనత కారణంగా చెవి సమస్య వచ్చిందా? చెవిలో ఇన్ఫెక్షన్ ఉందా? లేదా? అన్న దాoతో పాటు ఇతర పరీక్షలు చేస్తారు.

– ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ పరికరం ద్వారా చెవుల మధ్య భాగంలో ఉండే పూయిడ్స్, ఇన్ఫెక్షన్లు, కర్ణభేరి కదలికలు, ఒత్తిడి, పనితీరులో ఉన్న సమస్యలను ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తారు.
*
బెరా మిషన్ ఖరీదు రూ. 12,28,500, ఇంపిడెన్స్ ఆడియో మెట్రీ ఖరీదు రూ.8,76,750 ప్యూర్టోన్ ఆడియో మెట్రీ పరికరం ఖరీదు రూ.7,14,090 వరకు ఉంది. సౌండ్ ప్రూప్ గది ఏర్పాటుకు రూ.6,42,000 ఖర్చు పెడుతున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్టీజీఎస్ సీసీటీవీ360… న‌మ్మికైన నేస్తం

-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తున్న స‌ర్వైలెన్సు వ్య‌వస్థ‌ -రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు బాల‌ల ఆచూకీ క‌నుగొన్న సీసీకెమెరాలు -య‌ల‌మంచిలిలో ఇద్ద‌రు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *