Breaking News

పి.బి. సిద్ధార్థ, ఎస్.ఆర్. వర్సిటీ మధ్య ఒప్పందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశోధక విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు విజయవాడ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఎస్.ఆర్. యూనివర్సిటీ (వరంగల్) మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. పి.బి. సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ డా . మేకా రమేశ్, ఎస్.ఆర్. యూనివర్సిటీ డీన్ డా. బాలాజీ మారం ఈ ఒప్పందపత్రాలపై శుక్రవారం సంతకాలు చేశారు. పిహెచ్.డి. చేసే విద్యార్థులకు ఈ పరస్పర అవగాహన ఒప్పందం కారణంగా సాంకేతిక సహకారం, సేవలు అందుతాయన్నారు. పోస్ట్ డాక్టరేట్ సాంకేతిక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించటం, పాఠ్యప్రణాళికలు రూపొందించడం, నూతన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించడంలో కలసి పనిచేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ డా.రాజేష్ సి. జంపాల, ఎస్.ఆర్. వర్సిటీ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ స్కాలర్లు డా. టి.ఎస్. రవికిరణ్, డా. ఎం.వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *