Breaking News

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ అందచేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిట్టినగర్ 47వ డివిజన్ కు చెందిన పిల్లా జనార్ధనరావు గుండె వాల్వ్ ల సమస్యతో బాధపడుతున్నాడు. ఆయనకు సర్జరీ కోసం 8,50,000 /- రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థికంగా స్తోమత లేకపోవడంతో ఆయన ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి వైద్య ఖర్చుల నిమిత్తం సాయం చేయాలని సీఎం సహాయ నిధికి లేఖ రాసారు. అందుకు సంబంధించిన ఎల్వోసీ పత్రాలను శుక్రవారం భవానీపురం ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో బాధితుడి కుటుంబ సభ్యులకు అందచేశారు. కార్యక్రమంలో 47 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు నాగోతి రామారావు, 46వ డివిజన్ టిడిపి ప్రెసిడెంట్ పోతినేని లోకేష్, 47వ డివిజన్ టిడిపి కార్యదర్శి మురుగుపూడి కోటేశ్వరరావు, 47వ డివిజన్ టిడిపి తెలుగు యువత అధ్యక్షుడు పొట్నూరి శివ , చిట్టినగర్ మండల అధ్యక్షులు బిజెపి మండల అధ్యక్షుడు యాలకుల అనిల్, సుజన మిత్ర లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *