Breaking News

‘పవిత్ర కృష్ణానదిలో ఆది దంపతుల నదీ విహారం’

ఇంద్రకీలాద్రి,03 ఏప్రిల్ 2026

చైత్ర మాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు -2026 పురస్కరించుకొని తేది. 03.04.2026 సాయంత్రం 5 గంటలకు -ఇంద్రకీలాద్రి శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయం నుండి దేవ దేవీరిలకు పవిత్ర కృష్ణానదిలో- నదీ విహారం నిర్వహించుటకు ఊరేగింపుగా తీసుకొని వెళ్లే ఉత్సవము ప్రారంభ మైనది.

వేద మంత్రాలు, మంగళ వాయిధ్యాలు నడుమ స్వామి, అమ్మ వార్లకు నదీ విహారము నిర్వహించటకు మల్లేశ్వర స్వామి ఆలయం నుండి బయలుదేరిన బృందం మహామండపం వద్దనుండి కూచిపూడి నృత్య కళాకారులు, సంప్రదాయ తప్పెట్లు, కోలాటం, భజన సంకీర్తన లతో కోలాహలంగా దుర్గా స్నానఘాట్ చేరింది.
పుష్పాలంకరణ చేసిన ఫంటు పై స్వామి, అమ్మవార్లను అధిరోహింపజేసి,ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవిత్ర కృష్టానదిలో నదీవిహారం ప్రారంభం కాగా కళ్యాణోత్సవ ఆది దంపతులను కృష్ణా నదిలో త్రిలోకములకు గుర్తుగా మూడుసార్లు ప్రదక్షిణ చేయించి విహరింపజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వీకే శీనా నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు,స్థానాచార్య శ్రీ వి.శివ ప్రసాద్ శర్మ,ముఖ్య అర్చకులు శ్రీ ఆర్. శ్రీనివాసశర్మ, దేవస్థానం కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీమతి ఎల్. రమ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *