గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
లక్ష్య సాధనకు పక్కా ప్రణాళికలు ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో ఆయా శాఖల ప్రగతిపై కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీకలవాగు, కొండవీటివాగు వంటి వరద ప్రభావిత వాగులపై స్పష్టమైన కార్యాచరణ ఉండాలని ఆదేశించారు.
ఎం.ఎస్.ఎం.ఇ పార్కులను ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ మోడల్ లో ఏర్పాటుకు నియోజక వర్గాల్లో రెండు ఎకరాల స్థలం గుర్తించాలన్నారు. ప్రతి ఇంటికి సురక్షిత తాగు నీరు అందించుటకు అవసరం ఉన్న అన్ని గ్రామాలను జల్ జీవన్ మిషన్ లో పెట్టుటకు అవకాశాలు పరిశీలించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ శత శాతం ఉపయోగించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. గుంటూరు చానెల్, గుంటూరు నల్లా, పీకలవాగుల వరద తీవ్రత లేకుండా స్పష్టమైన చర్యలు చేపట్టడం, అవసరమైతే సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో ఎస్.టి.పి నిర్మాణం దిశగా ఆలోచన చేయాలని ఆదేశించారు. సజావుగా నీటి పారుదల ఉండుటకు వాగుల్లో ప్లాస్టిక్ నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజధానిలో జరుగుతున్న పనులకు మెటీరియల్ కొరత లేకుండా గనుల శాఖ అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి వర్యులతో ఈ నెల 7వ తేదీన ఉన్న జిల్లా సమీక్ష సమావేశానికి నిర్దిష్టమైన అంశాలతో సమగ్ర ప్రణాళికలను సమర్పించాలని ఆదేశించారు.
గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ పీకలవాగు ఆక్రమణలకు గురికావడం వలన వరదలు వచ్చినపుడు గుంటూరు పట్టణంలో కొన్ని ప్రాంతాలు ముంపుకు గురి అవుతున్నాయని, ఆక్రమణలు ఏ మేరకు ఉన్నాయో సర్వే జరుగుతోందన్నారు.
జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం మాట్లాడుతూ బండారుపల్లి ఛానెల్, గుంటూరు చానెల్, కొండవీటివాగు, గుంటూరు నల్లా, పీకలవాగులపై వివరించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, రెవిన్యూ డివిజనల్ అధికారులు కె.శ్రీనివాస రావు, లక్ష్మీ కుమారి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి కె.మయూరి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పార్థసారథి, జిల్లా మత్స్య శాఖ అధికారి పి.ఎన్.కిరణ్ కుమార్, పర్యాటక అధికారి రమ్య, ప్రాంతీయ పర్యవేక్షక అధికారి జి.సునీత, ముఖ్య ప్రణాళిక అధికారి పి.శేష శ్రీ, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జయలక్ష్మి, ఆర్ అండ్ బి పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాస మూర్తి, జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.దుర్గా భాయి, కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎ. గాయత్రి దేవి, ఎం.టి.ఎం.సి కమిషనర్ అలీం భాషా, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News