-కేంద్ర మంత్రి రామ్మోహన నాయుడు ఇంట్లో విందు -పాల్గొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి , యువ నేత నారా లోకేష్ -విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని)ను ఆప్యాయంగా పలకరించిన యువ నేత, మంత్రి లోకేష్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి పార్టీ లకు చెందిన ఎంపీ లు అందరూ బుధవారం ఆత్మీయంగా సమావేశమయ్యారు. కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఇంట్లో మధ్యాహ్నం జరిగిన విందులో కూటమి ఎంపీలు అందరూ …
Read More »Tag Archives: delhi
లోక్‌సభ స్పీకర్‌పై తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం : వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో స్పష్టం చేశారు. సభలో మాట్లాడుతూ స్పీకర్ పదవికి, పార్లమెంటు సంప్రదాయాలకు ఉన్న గౌరవాన్ని కాపాడటం కోసమే తమ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. తమ పార్టీ ఏ కూటమికీ చెందినది కాదని, తాము ఎన్డీయే కూటమిలోనూ లేమని, ఇండియా కూటమిలోనూ లేమని ఆయన పేర్కొన్నారు. సభ గౌరవం, స్పీకర్ స్థానం పరిరక్షణ …
Read More »తిరుపతి ప్రాంతాన్ని అరుదైన ఖనిజ కారిడార్‌లో చేర్చాలని ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : అరుదైన ఖనిజాల అభివృద్ధి, వాటి ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించే అంశంపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో అరుదైన ఖనిజాల కారిడార్‌ల ఏర్పాటు, తిరుపతి ప్రాంతాన్ని కూడా అందులో చేర్చే అవకాశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన వివరాలు కోరారు. ఈ ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు శాఖతో పాటు ప్రధాన మంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు. కేంద్ర బడ్జెట్ 2026–27లో …
Read More »ఆంధ్రప్రదేశ్‌లో పంట ఉత్పాదకత, రైతు సంక్షేమంపై వివరాలు కోరిన ఎంపీ గురుమూర్తి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయం, రైతుల సంక్షేమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో పంటల ఉత్పాదకత పెంపు అంశంపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. వరి వంటి ప్రధాన పంటల దిగుబడులు జాతీయ సగటుతో పోలిస్తే తక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక పంట ఉత్పాదకత వ్యూహం రూపొందించిందా అని కేంద్రాన్ని అడిగారు. అలాగే జిల్లాల వారీగా దిగుబడి లోటుపాట్లపై అంచనాలు చేసి వాటిని రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకున్నారా, సూక్ష్మ సాగు విధానాలు, మెరుగైన విత్తనాల వినియోగం, వ్యవసాయ సలహా …
Read More »బాల కార్మికుల నివారణకు చర్యలు ఏంటి – లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ప్రశ్న
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో బాల కార్మికుల నివారణ, అసంఘటిత రంగం, కుటుంబ ఆధారిత చిన్నతరహా పరిశ్రమల్లో పిల్లలను ఉపయోగిస్తున్న అంశాలపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కర్లందాజే సమాధానం ఇచ్చారు. బాల కార్మికుల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బాల కార్మికుల నిషేధం, నియంత్రణ చట్టం 1986 ను అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ చట్టం ప్రకారం 14 సంవత్సరాల …
Read More »క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీ వినియోగంపై లోక్‌సభలో ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్న
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో రోజురోజుకీ క్యాన్సర్ మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీ వినియోగంపై తిరుపతి లోక్‌సభ సభ్యులు మద్దిల గురుమూర్తి శుక్రవారం పార్లమెంట్‌లో కీలకమైన ప్రశ్నను లేవనెత్తారు. ప్రభుత్వ ఆమోదిత వైద్య మార్గదర్శకాల ప్రకారం ఇమ్యునోథెరపీకి అనుమతి ఉందా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ చికిత్స అందుబాటులో ఉందా, అలాగే దీనికి సంబంధించిన ప్రోటోకాల్స్, రోగుల అర్హత ప్రమాణాలు, పర్యవేక్షణ వ్యవస్థల వివరాలు ఏమిటి అనే అంశాలపై ఆయన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. …
Read More »ఢిల్లీ వేదికపై ఏపీ విద్యాశాఖ ఏఐ (AI) మెరుపులు
– సాంకేతికతతో విద్యా వ్యవస్థలో సరికొత్త విప్లవం – భారత్ బోధన్ ఏఐ కాంక్లేవ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆంధ్రప్రదేశ్. – రెండో రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో ఆకట్టుకున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు – సమావేశంలో పాల్గొన్న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు. వి. IAS., , సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు IAS., – పాల్ (PAL) ల్యాబ్స్, మధ్యాహ్న భోజన పర్యవేక్షణపై ప్రత్యేక వివరణ – ఆంధ్రప్రదేశ్ మోడల్‌ను …
Read More »జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ (NSCAEM) కింద ఎపీలో రెండు అత్యున్నత సేవల కేంద్రాలు
-విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్, మంగళగిరి AIIMS కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) గా గుర్తింపు -ఎపీలో 14.79 లక్షల మందికి సికిల్ సెల్ పరీక్షలు- 4,78,188 మందికి జెనెటిక్ స్టేటస్ కార్డులు పంపిణీ -విశాఖ కింగ్ జార్జ్ హాస్పటల్ కు రూ.7 కోట్లు 64 లక్షలు నిధులకు ఆమోదం-రూ. 7 కోట్ల 55 లక్షలు విడుదల -కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ వెల్లడి -సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్ సౌకర్యాలపై ప్రశ్నించిన ఎంపీ కేశినేని …
Read More »ఏపీ నుంచి ఎ.ఐ.బి.పి కింద ఎలాంటి ఈ.ఆర్.ఎమ్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు రాలేదు
-పోలవరం 85% పూర్తి – 2024-2025 లో రూ.5,512 కోట్లు నిధుల విడుదల -కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి వెల్లడి -ఆంధ్రప్రదేశ్‌లో PMKSY-AIBP కింద ప్రాజెక్టుల వివరాలపై ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వేగవంతమైన సాగునీటి ప్రయోజనాల కార్యక్రమం (AIBP) కింద ఎలాంటి ఈ.ఆర్.ఎమ్ (ERM- విస్తరణ, పునరుద్ధరణ, ఆధునీకరణ) ప్రాజెక్ట్ ప్రతిపాదనలు ఇప్పటివరకు రాలేదని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి …
Read More »చట్టాల స్పష్టతతోనే కార్మిక హక్కులకు భద్రత – ఎంపీ గురుమూర్తి
-విశాఖ స్టీల్ ప్లాంట్ అనుభవమే చట్టాల స్పష్టత అవసరాన్ని చూపుతోంది న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామిక సంబంధాల కోడ్ (సవరణ) బిల్లు 2026పై లోక్‌సభలో జరిగిన చర్చలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ బిల్లు పరిమాణంలో చిన్నదైనా ప్రభావంలో పెద్దదని ఆయన పేర్కొన్నారు. ఇది చట్టపరమైన స్పష్టతను తీసుకువచ్చినా కొన్ని లోపాలు ఇంకా మిగిలే ఉన్నాయని అన్నారు. సెక్షన్ 104 ద్వారా పాత మూడు కార్మిక చట్టాలు పూర్తిగా రద్దయ్యాయని ఈ సవరణ …
Read More »
Prajavartha Online Telugu News