Breaking News

ఢిల్లీలో కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశం

-కేంద్ర మంత్రి రామ్మోహన నాయుడు ఇంట్లో విందు
-పాల్గొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి , యువ నేత నారా లోకేష్
-విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని)ను ఆప్యాయంగా పలకరించిన యువ నేత, మంత్రి లోకేష్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి పార్టీ లకు చెందిన ఎంపీ లు అందరూ బుధవారం ఆత్మీయంగా సమావేశమయ్యారు. కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఇంట్లో మధ్యాహ్నం జరిగిన విందులో కూటమి ఎంపీలు అందరూ పాల్గొన్నారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న విద్య, ఐటీ శాఖల మంత్రి, యువ నాయకులు నారా లోకేష్ ఈ ఆత్మీయ సమావేశానికి హాజరై కూటమి ఎంపీలతో కలసి సందడి చేశారు. ఎంపీలందరినీ ఆప్యాయతతో పేరుపేరునా పలకరించారు. విందుకు హాజరైన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) సైతం మంత్రి లోకేష్ ను కలిసి కొద్దిసేపు ఆయనతో మాట్లాడారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *