విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులు వసూలు దోపిడికి అడ్డుకట్ట వేసే క్రమంలో ఫీజుల దోపిడీని కొంత మేరకు కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 54ను స్వాగతిస్తూ.. విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ గుర్తింపు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్.యస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులు వసూలు దోపిడిని కట్టడి చేసేందుకు విడుదల చేసిన జీవో నెంబర్ 54ను స్వాగతిస్తూ.. ప్రభుత్వ గుర్తింపు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేసే ప్రైవేట్ విద్యాసంస్థలపైన, ప్రభుత్వ గుర్తింపు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఆన్లైన్ తరగతుల నిర్వహణ పేరుతో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఫీజులను వసూలు చేశారనీ, కేవలం ఫీజుల వసూళ్లుతో సరిపెట్టుకోకుండా N-120, N-40, CO-Spark, Spark, IC, Z-FTB AC, Z-FTB శిక్షణల పేరుతో వాటి మెటీరియల్ పేర్లతో వేల రూపాయల దోచుకుతింటున్నారన్నారు. విద్యాశాఖ విడుదల చేసిన జీవో నెంబర్ 54ను ప్రైవేట్ విద్యాసంస్థల తప్పకుండా పాటించేలాగ.. ఇప్పటికే ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన జీవో నెంబర్ 54లో పొందుపరచిన ఫీజుల కంటే ఎక్కువ మొత్తంలో ఫీజులను వసూలు చేసిన విద్యా సంస్థలు సదరు మిగిలిన ఫీజులను విద్యార్థుల తల్లిదండ్రులకు పూర్తిగా తిరిగి చెల్లించాలని, అలా చెల్లించని పక్షంలో విద్యార్థుల పక్షాన నిలిచి విద్యా సంస్థలు తిరిగి చెల్లించే వరకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్.యస్.యు.ఐ. పోరాడుతుందన్నారు.
Tags vijayawada
Check Also
సంజా ఉత్సవ్ ను అందరూ సందర్శించండి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 26, 2024 నుండి మ్యారీస్ స్టెల్లా …