Breaking News

ఇళ్ల పనులేవీ ఆగకూడదు : క‌లెక్ట‌ర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు అనేది ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని, న‌గ‌రంలో వైఎస్సార్‌ – జగనన్న కాలనీల్లో తొలిదశ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని జిల్లా క‌లెక్ట‌ర్ జె.నివాస్ ఐ.ఎస్.ఎస్ అధికారుల‌కు అదేశించారు. న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్‌ అధ్వ‌ర్యంలో శుక్ర‌వారం తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో గృహ నిర్మాణాలపై అధికారులు మరియు సిబ్బందితో సమీక్షించారు. స‌మావేశంలో పాల్గొన్న క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ నున్న‌లో 4148 ల‌బ్దిదారులకు కెటాయించిన స్థ‌లాల్లో తొలిదశ నిర్మాణ పనులను ప్రారంభించాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ అదేశించారు. కోవిడ్‌ సమయంలో ఇళ్ల నిర్మాణ కార్యకలాపాలు చేపట్టడం వల్ల పనులేవీ ఆగకుండ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. ఇళ్ల నిర్మాణానికి నీరు, విద్యుత్‌ కీలకం కాబట్టి వెంటనే ఆ ఏర్పాట్లు చేసుకోవాలి. కేవలం ఇళ్లు నిర్మించడమే కాదు. తగిన మౌలిక వసతులు కూడా కల్పించాలి. లేఅవుట్‌ పక్కాగా ఉండాలి. సీసీ రోడ్లు, భూగర్భ సీసీ డ్రెయిన్లు, నీటి సరఫరా (జేజేఎం), విద్యుదీకరణ, ఇంటర్నెట్‌ లాంటివి మౌలిక వసతుల్లో ముఖ్యమైన కాంపోనెంట్స్‌. కరెంటు, నీటి సరఫరాతో పాటు రోడ్లు కూడా నిర్మించాల‌న్నారు.

ప్రతి కాంట్రాక్టర్లు ఇళ్లను నిర్మించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి…
ఇళ్ల నిర్మాణాలకు సిమ్మెంట్, స్టీల్, ఇసుక కొరత లేదు అని, కాంట్రాక్టరు ఇళ్లను నిర్మించే విదంగా అధికారులు చర్యలు చేపట్టాల‌న్నారు. ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ద్వారా ఇసుక సరఫరా చేస్తున్నామన్నారు. అధికారులు లబ్దిదారులను మోటివేట్ చేస్తూ ఇల్లు నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విదంగా జగనన్న కాలనీల్లో అంతర్గత రహదారులు, విద్యుత్, నీటి వసతి, మెరక వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినా ఇళ్ల నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతుందని అధికారులను నిలదీసారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. వీటితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, ఇతర నాయకులను సహాకారం తీసుకొంటూ ఇళ్ల‌ నిర్మాణంలో పురోగతి సాధించాలన్నారు. ఇంకా గ్రౌండింగ్ కాని ఇల్లు లబ్దిదారుల చేత నిర్మాణం చేపట్టే విధంగా మోటివేట్ చెయ్యాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. ఇళ్లు, నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చింగా పాటించాలని అధికారులకు కలెక్టరు సూచించారు.
సమావేశంలో శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ ఐ.ఏ.ఎస్., జాయింట్ కలెక్టర్ హౌసింగ్, నగరపాలక సంస్థ ప్రాజెక్ట్ అధికారి & అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్స్, వార్డ్ ఏమినిట్స్, రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

విద్యాసాగర్ పదవీ ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలిరండి…

– ఏపీఎన్జీజీవో నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ పిలుపు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి ఎన్జీజీఒ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *