విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే ఆహార పదార్థాల నాణ్యతలో ఎటువంటి లోపాలు వుండకూడదని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అన్నారు. స్థానిక జెసి క్యాంప్ కార్యాలయంలో శనివారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఈనెల 31వ తేదిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అందుకు సంబంధించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నులిపురుగులను నిర్మూలించి ఆరోగ్యవంతమైన పిల్లలను తయారు చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం వైఎస్సార్ సంపూర్ణపోషణ మోనటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆహారపదార్థాల సరఫరా పారదర్శకంగా జరగాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గర్భవతులు, బాలింతలకు ప్రభుత్వం తరపున మెడికల్, ఐసిడిఎస్ డిపార్టుమెంట్ నుంచి అందిస్తున్న స్కీమ్ పై సమీక్షించారు. బాల్యవివాహాలను నివారించాలని, అన్ని డిపార్టుమెంటుల సమన్వయంతో సమర్థవంతంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఐసిడిఎస్ పిడి కె. ఉమరాణి, డిఎస్పీ బి. నారాయణ, వైద్య, పౌరసరఫరాలు, సిడిపివోలు, వైఎస్సార్ సంపూర్ణపోషణ సరఫరా ఏజన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గంగూరు రైతు సేవా కేంద్రం సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
పెనమలూరు (గంగూరు), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం …