విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలచివున్న రెండు బ్రిడ్జిల పనులు 15 రోజుల్లోపు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశపు భవనంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అసంపూర్తిగా వున్న పనులను కలెక్టర్ జె.నివాస్, సెంట్రల్ ఎంఎ మల్లాది విష్ణు సమీక్షించారు. నియోజక వర్గంలో , బ్రిడ్జిల నిర్మాణం జరగాల్సి వుందని దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంఎస్ఈ సమావేశం దృష్టికి తెచ్చారు. అందులో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న రైవస్ కెనాల్ పై 5.3 కోట్ల రూపాయలతో 1.2 కి.మీ పొడవున డబల్ లైన్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉందన్నారు. అలాగే ఏలూరు కెనాల్ పై 4.5 కోట్ల రూపాయలతో 1.2 కి.మీ పొడవున డబల్ లైన్ బ్రిడ్జి నిర్మాణం కూడా నిలిచి వుందన్నారు. అలాగే సత్యనారాయణ పురంలో ఏలూరు కెనాల్ పై 4.32 కోట్ల రూపాయలతో నిర్మించాల్సిన 3.7 కి.మీ పొడవైన బ్రిడ్జి కూడా నిలిచివుందన్నారు. అంతేగాక రైవస్ కెనాల్ పై 4.26 కోట్ల రుపాయలతో 3.1 కిమీ పొడవున నిర్మించాల్సిన మరో బ్రిడ్జి కూడా పనులు ప్రారంభం కాక నిలిచివుందన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద రామకృష్ణపురంలో 4.07 కోట్ల రూపాయలతో మరో డబల్ లైన్ రోడ్డు బ్రిడ్జి కూడా ఇంకా ప్రారంభం కాలేదన్నారు. ఇందుకు అవసరమైన నేల సామర్థ్యం పరీక్షలు కూడా పరిశీలించారన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ గుణదల వద్ద 4.78 కోట్ల రూపాయలతో నిర్మించాల్సిన డబల్ లైన్ రోడ్డు బ్రిడ్జిని, బుడమేరు పరిధిలో 3.59 కోట్ల రూపాయలతో నిర్మించాల్సిన మరో డబల్ లైన్ బ్రిడ్జిని వెంటనే 15 రోజులలోపు పనులు ప్రారంభించాలని నీటి పారుదలశాఖ ఎ»
మురళీకృష్ణా రెడ్డిని ఆదేశించారు. అలాగే ఆర్ టిసి సిటీ బస్ స్టాప్ నిర్మించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ స్థలాన్ని కేటాయించాలని ఎంఎల్‌ఎ కోరగా మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ అంగీకరించారు. అలాగే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ గుణదల గ్రామంలో నిర్మించేందుకు 0.26 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని అందుకు తగిన అనుమతినివ్వాలని కోరారు. విజయవాడలో నడిబొడ్డున ఉన్న జిల్లా జైలును విజయవాడ నగరానికి బయటకు తరలించాలని ఆ స్థానంలో ప్రత్యేకంగా కాంప్లెక్స్ కూడా నిర్మించవచ్చని ఎం.ఎల్.ఎ మల్లాది విష్ణు కలెక్టర్ లో చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపమని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరం 4 మండలాల్లో విస్తరించి ఉందని అందువల్ల సరిహద్దు సమస్యలు కూడా వస్తున్నాయన్నారు. ఆ సమస్యలు కూడా పరిష్కరించమని కలెక్టర్‌ను కోరారు. జాయింట్ కలెక్టర్ డా. కె.మాధవీలత, సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ర, 4 మండలాల తహసీల్దార్లు కూడా పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …