విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో గాంధీనగర్, అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ నందు వినూత్నంగా రిక్షా తొక్కుతూ నిరసన – ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు లు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఒక్క చాన్సు అని గద్దెనెక్కి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరలను, నిత్యావసర ధరలన్నీ పెంచేశారని మండి పడ్డారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో పెట్రోల్ రేటు 75రూపాయలు ఉంటే ఆ భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వమే 4రూపాయలు తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఈనాడు పెట్రోల్ 106 రూపాయలు పెంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి భారాన్ని ప్రజలపై వేసి కష్టాలపాలు చేస్తున్నారని వాపోయారు. టీడీపీ హయాంలో రూ.500ఉన్న గ్యాస్ బండ నేడు 900 రూపాయలు అయ్యిందని పేర్కొన్నారు.పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు రవాణా రంగంపై ప్రత్యక్ష ప్రభావం చూపడంపై నిత్యావసర ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయి సామాన్యుడికి కొనుగోలు శక్తీలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దరల స్థిరీకరణ నిధి 5000కోట్లు ఏర్పాటు చేసి ఏ కారణంగా అయినా ధరలు పెరిగితే ఆ భారం ప్రజలపై పడకుండా ఉంటుందని తెలిపారు. ఈరోజు ఆ ధరల స్థిరీకరణ నిధులు ఏమయ్యాయి అని వారు ప్రశ్నించారు. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వం వేసే వ్యాట్ టాక్స్ ను తగ్గించి కనీసం పెట్రోల్ పై 25 రూపాయలు అలాగే గ్యాస్ బండ పై కనీసం 200రూపాయలు టాక్స్ ను తగ్గించి, ప్రజలపై పడుతున్న భారాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ధరలు తగ్గించేంతవరకు తెలుగుదేశంపార్టీ ఆందోళనలు కొనసాగుతాయని, రాబోయే రోజుల్లో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసుకొని ప్రభుత్వంపై పోరాడుతాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్సులు నవనీతం సాంబశివరావు, గన్నే వెంకట నారాయణ ప్రసాద్, ఫిరోజ్, టియన్టియుసి రాష్ట్ర కార్యదర్శి గొట్టుముక్కల రఘురామరాజు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ముమ్మనేని ప్రసాద్, వీరమాచినేని లలిత, చెన్నగిరి రామ్మోహన్, వల్లభనేని రాజేశ్వరి, కంచి దుర్గ, విజయవాడ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణ, ఇప్పిలి మోహన్, బి. లక్ష్మి, మాచెర్ల గోపి, వల్లభనేని సతీష్, దాసరి జయరాజు, బండారు అంజి, చింతల మధుబాబు, మద్దాల రుక్మిణి, కాకు మల్లికార్జున యాదవ్, అంగిరేకుల రాంబాబు, అడపా కోటేశ్వరరావు, గరిమెళ్ళ రాధిక, కరణం రమణ, సందిరెడ్డి గాయత్రి, పడమటి రామకృష్ణ, మురళి, రాజేష్, దెందుకూరి మురళి కృష్ణమ రాజు, ఇప్పిలి వరాలు, గార్లపాటి విజయ్, ప్రయాగ కృష్ణ, చామర్తి రవి, చలమలశెట్టి శ్రీనివాస్, మాధవ ప్రసాద్, మద్దినేని సుభ్రమణ్యం, సింగ్, పిరియా సోమేశ్వరరావు, బూదాల సురేష్, చల్లగాలి డేవిడ్, పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గంగూరు రైతు సేవా కేంద్రం సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
పెనమలూరు (గంగూరు), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం …