విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం హరే క్రిష్ణ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో, కొత్తపేట యాదవ్ కల్యాణ మండపంలో, బ్రహ్మాణ వీధిలో వేణుగోపాల స్వామి దేవాలయంలో, శ్రీ కృష్ణ ప్రార్దన మందిరం, రామవరప్పాడు రింగ్ వద్ద ఆలయంతో సహా పలు చోట్ల జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చోరవతో రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ది చర్యలు చేపట్టిన్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ గోకుల నందనుడు శ్రీకృష్ణ భగవానుని జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయమన్నారు. ప్రపంచానికి గీతను బోధించి, ప్రేమ తత్వాన్ని పంచిన గురువు శ్రీకృష్ణ పరమాత్ముడన్నారు. భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు భోదించిన సందేశాన్ని శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ గుర్తుచేస్తుందన్నారు. కృష్ణతత్వం చదివిన వారికి నిజమైన ప్రేమతత్వం తెలుస్తుందన్నారు. కృష్ణుని రూపం పూజలందుకునే ప్రతిచోటా ఆయన వెనుకే గోవు కూడా ఉంటుందన్నారు. గోమాత గొప్పదనాన్ని భావితరాలకి తెలియచేప్పేందుకు టీటీడీ ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందన్నారు. మన సంస్కృతీ, సాంప్రదాయాలను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. శ్రీ కృష్ణ పరమాత్ముని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపైన, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపైన ఎల్లవేళలా ఉండాలన్నారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ శ్రీ కృష్ణుని లీలలతో భక్తి, జ్ఞానం, యోగం, మోక్షం గురించి ప్రపంచానికి తెలియజేసిన శ్రీకృష్ణపరమాత్మ పుట్టిన శుభదినం శ్రీ కృష్ణాష్టమి అన్నారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక పూజలు, ఉయ్యాలలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఉంచి లాలి పాట పాడుతూ కృష్ణయ్యను పూజించారు. కార్యక్రమంలో వేద పండితులు అభిషేకాలు నిర్వహించారు. కృష్ణునిలీలలు, తాత్వికచింతనలను చదివి వినిపించారు. ప్రత్యేక ఆకర్షణగా చిన్నపిల్లల శ్రీకృష్ణ వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిలిచాయి.
Tags vijayawada
Check Also
గంగూరు రైతు సేవా కేంద్రం సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
పెనమలూరు (గంగూరు), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం …