విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జి.కొండూరు మండలం కవులూరు గ్రామంలో నీటిపారుదల సమస్య పరిష్కారం కోసం మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలిసి విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కవులూరు గ్రామంలో పంట కాలువలు నీటి పారుదల సమస్యతో రైతులు, గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వినతి మేరకు జలవనరుల శాఖ ఇంజినీర్లు, మండల సర్వ్ యర్,కవులూరు గ్రామ ఇంజనీరింగ్ అసిస్టెంట్ తదితరులతో కూడిన కమిటీ ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి గల వివిధ మార్గాలను అన్వేషించి పదిరోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించగానే సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ఆదేశించారు. సమావేశంలో జలవనరుల శాఖ ఇంజినీర్లు పి.సతీష్ కుమార్,ఎన్. ఉమాశంకర్,ఎన్. సత్యనారాయణ, తహసీల్దార్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
విద్యాసాగర్ పదవీ ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలిరండి…
– ఏపీఎన్జీజీవో నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ పిలుపు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి ఎన్జీజీఒ …