-అక్రమాలపై సి.ఐ.డి.ని దర్యాప్తు కోరడం జరిగింది..
-ఏ.పి. ఫైబర్ నెట్ సంస్థలో రూ. 121 కోట్లు అక్రమాలు జరిగినట్లు సిఐడి గుర్తించింది…
-ప్రాధమిక విచారణలో 18 మందిపై అక్రమాలకు పాల్పడ్డారనే అనుమానంతో కేసులు…
-సమగ్ర విచారణ జరిపి అవకతవకలకు పాల్పడ్డ ఎంతటివారినైనా శిక్షించి తీరుతాం…
-ఏపియస్ యఫ్ యన్ యల్ ఛైర్మన్ పి.గౌతమ్ రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వ హయాంలో ఏపి స్టేట్ ఫైబర్ నెట్ పంప్లలో జరిగిన అక్రమాలపై సిఐడి విచారణ జరిపి రూ. 121 కోట్ల రూపాయలు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించి దీనిలో భాగస్వాములైన 18 మంది పై వివిధ చట్టాల క్రింద కేసులు నమోదు చేయడం జరిగిందని సమగ్ర విచారణ జరిపి బాధ్యులు ఎంతటివారి నైనా ఉపేక్షించేది లేదని ఏపియస్ యఫ్ యన్ యల్ ఛైర్మన్ పి. గౌతమ్ రెడ్డి తెలిపారు.
ఏపి స్టేట్ ఫైబర్ నెట్ సంస్థలో జరిగిన అక్రమాలపై వివరించేందుకు సంస్థ ఛైర్మన్ పి. గౌతమ్ రెడ్డి సోమవారం విజయవాడలోని ఆర్ టీసి కాంప్లెక్స్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సంస్థలో రూ. 121 కోట్లు అవకతవకలు జరిగాయని సిఐడి సంస్థ ప్రాధమిక విచారణలో గుర్తించిందన్నారు. వీటిలో సంస్థకు వివిధ కంపెనీల ద్వారా సరఫరా చేసిన ఐటమ్స్ కు సంబంధించి రూ. 8 కోట్ల 20 లక్షలు పవర్ మీటర్ల ద్వారా ఓటి జిఆర్ మీటర్లకు బదులు పవర్ మీటర్లను ఉపయోగించడం ద్వారా రూ. 1 కోటీ 60 లక్షలు వైర్లు సెటప్ బాక్స్ లు తదితర సాంకేతిక పరికరాలసరఫరాలో రూ. 62 కోట్ల 06 లక్షలు సరి అయిన పత్రాలు సమర్పించకుండా బిల్లులు చెల్లింపులు ద్వారా రూ. 29 కోట్ల 20 లక్షలు ముందుగా రూపొందించిన డిజైన్లను మార్పుచేర్పులు చేసి పనులు నిర్వహించడం ద్వారా రూ. 20 కోట్ల 25 లక్షల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించడం జరిగిందన్నారు. అక్రమాలకు పాల్పడిన 18 మంది పై ఈనెల 9వ తేదీన వివిధ సెక్షన్ల క్రింద యఐఆర్ ను నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ అవకతవకల్లో 18 మంది వ్యక్తుల పాత్ర ఉన్నట్లు అనుమానించడం జరిగిందన్నారు. వీరిలో వేమూరి హరికృష్ణప్రసాద్ ప్రధాన పాత్ర పోషించినట్లుగా సిఐడి
టెండర్ల ప్రక్రియంలో అనేక అవకతవకలు చోటు చేసుకోవడం జరిగిందన్నారు. టెరాస్మార్ట్ సంస్థలో యండిగా పనిచేస్తున్న హరికృష్ణ ప్రసాద్ తో రాజీనామా చేయించి ఆయనను ఏపి ఫైబర్ నెట్ డైరెక్టరుగా నియమించారన్నారు. ఆయనకు టెండర్ల కమిటీ బాధ్యతలను అప్పగించారన్నారు. వీరితోపాటు గోపీచంద్ పద్మావతి కోటేశ్వరరావు నాగేశ్వరరావు అనేవారల పాత్రకూడా ఉందని వీరిలో కోటేశ్వరరావు నాగేశ్వరరావులకు నారావారిపల్లి మండలం గ్రామస్థులతో బంధుత్వాలు ఉన్నాయన్నారు. 2015 ఆగష్టు 11న టెక్నికల్ కమిటీ ముందుకు వచ్చిన టెండర్ల పై కమిటీ రెండు రోజుల్లో సమావేశమై ఆమోదముద్ర వేయడం వెనుక ఆంతర్యం ఏమిటో తేటతెల్లం అవుతుందన్నారు. టెండర్లు దక్కించుకున్న టెరాప్మార్డ్ సంస్థ పలు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి ఆసంస్థమ సస్పెండ్ చేసి సంవత్సరంపాటు బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగిందన్నారు. అయితే బ్లాక్ లిస్ట్ లో పెట్టిన రెండు నెలలకే సస్పెన్షన్ ఎత్తివేసి బ్లాక్ లిఫ్ట్ నుంచి సంస్థ పేరును తొలగించారన్నారు. వాస్తవంగా 2015 జూలై 31వ తేదీ టెండర్లకు చివరితేదీగా ఖరారు చేసారని దాన్ని టెరాస్మార్ట్ కోసం మరోవారం పొడిగించి టెరాప్కార్ట్ సంస్థకు టెండర్లను చేజిక్కించుకునేలా సహకరించడం జరిగిందన్నారు. ఏటెండర్ నైనా టెక్నికల్ కమిటీ పరిశీలించి టెండర్ లో పాల్గొన్న వారి శక్తి సామర్థ్యాలను పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నారు. ఏపి ఫైబర్ నెట్ టెండర్లకు సంబంధించి 3 కంపెనీలు ఒకే కంపెనీగా ఏర్పడి ముగ్గురు భాగస్వామ్యంతో టెలీస్మార్ట్ పేరున టెండర్లు వేయడం జరిగిందన్నారు. వీరిలో ఒక వ్యక్తిని తొలిగించి అప్రూవల్ కమిటీ టెలీస్మార్ట్ సంస్థకు టెండర్లను కట్టబెట్టిందన్నారు. బేస్ పవర్ సిస్టమ్ పంస్థ రెండు లేఖలు ద్వారా టెలీస్మార్ట్ సంస్థపై ఫిర్యాదు చేసినా కవీసం విచారణకూడా చేపట్టకుండా అడ్డదారిలో వచ్చిన సంస్థకు టెండర్ ఖరారు చేయడమే కాకుండా ఫిర్యాదుదారుని బెదిరించి ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేసినట్లు సిఐడి గుర్తించిందని ఇది ఎంతవరకూ పబబు అని అన్నారు. టెండర్లు తెరిచిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ మార్పు చేర్పులకు తావులేదని జి.ఓ.యంయప్. 16 తెలియజేస్తుందన్నారు. బ్లాక్ లిస్ట్లో ఉన్న సంస్థలు క్రింది స్థాయి అధికారి సంతకంతో టెండర్ల ప్రక్రియ జరపడం పట్ల ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. అయినప్పటికీ ఇందుకు విరుద్ధంగా ఇక్యాప్ టెలీస్మార్ట్ కు లేఖ
వ్రాసి టెండర్ల ప్రక్రియకు సంబంధించి మార్పు చేర్పులకు అవకాశం కల్పించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఇది పూర్తిగా నియమనిబంధనలకు విరుద్దం అన్నారు. జి.ఓ.వెం. 16 మరియు 20 లోని అంశాలను వియమనిబంధనలను ఏమాత్రం పాటించ లేదన్నారు. సిబడి సమగ్ర విచారణలో ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు కూడా బాధ్యులు అవుతారన్నారు. బ్లాక్ లిస్లో ఉన్న సంస్థను తొలగించడం, టెండర్లలో పాల్గొనేలా అవకాశం కల్పించడం ఉన్నతాధికారుల అబ్జెక్షన్ ఉన్నప్పటికీ అతిక్రమించడం వంటి వాటిని గుర్తించి పిఐడి సంస్థ భారత శిక్షాస్మృతి 166, 167, 118, 465, 461, 468, 506 రెడ్ విత్ పెక్షన్ 120 (బి) వంటి సెక్షన్ల క్రింద కేసులను నమోదు చేసి సమగ్ర విచారణ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర మంత్రిమండలి అనుమతుల లేకుండా ఇలాంటి చర్యల్లో పాల్గొన్న ఎంతటి ప్రజాప్రతినిధులైనా ఉన్నతాధికారులైనా ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అక్రమాలకు పాల్పడి దుర్వినియోగం అయిన సంస్థ ఆస్థులను వారి మండి తిరిగి రాబట్టి శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటామని సంస్థ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి వివరించారు.