మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అమ్మా నాన్నలు వృద్ధులు కాగానే వారిని ఈసడించుకునే క్రూరులు, వృద్ధాశ్రమానికి ఈడ్చిపడేసే పరమ నీచులు , వీధినపడేసే దుర్మార్గులు, ఏకంగా వారిని అంతం చేసే కర్కోటకులు మన సమాజంలో నానాటికి పెరిగిపోతున్నారని తల్లితండ్రులను ప్రేమించని పుత్రులు పుట్టినా ఒకటే ..గిట్టినా ఒకటేనని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆవేదన వ్యక్తం చెశారు. సోమవారం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని ముఖాముఖిగా వారితో సంభాషించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. తొలుత పెద కరగ్రహారంకు చెందిన సి హెచ్ దేవరాజ్ అనే యువకుడు తన తల్లితో వచ్చి మంత్రిని కలిశారు. తాను నందమూరు ఇంజినీరింగ్ కాలేజీ లో సివిల్ రెండవ ఏడాది చదువుతుండగా తన తండ్రి అకస్మాత్తుగా చనిపోయాడని దాంతో తన తల్లి వంటరిగా ఉంటుందని చదువును అర్దాంతరంగా మానివేసానని, ఇప్పుడు ఆ చదువు కొనసాగించాలని ఆశ ఉన్నా ఏడాదికి 60 వేల రూపాయల చొప్పున మొత్తం 1 లక్షా 20 వేల రూపాయలను కాలేజీ యాజమాన్యంకు ఫీజుగా చెల్లించాలని దేవరాజు దిగులు చెందాడు. విషయమై స్పందించిన మంత్రి మాట్లాడుతూ, తండ్రి చనిపోయాడని నిరాశతో కుంగిపోక కసిగా ఎదగాలని తల్లిని మరింత ప్రేమగా చూసుకోవచ్చన్నారు. తాను సంబంధిత కళాశాల యాజమాన్యంతో మాట్లాడి ఆ మొత్తం ఫీజు చెల్లించనవసరం లేదని నీవు మళ్ళీ చదివి వృద్ధిలోకి వచ్చి జన్మ నిచ్చిన తల్లిని చక్కగా చూసుకోవాలని సూచించారు. స్థానిక నవీన్ మిట్టల్ కాలనీకి చెందిన గరికపాటి వెంకటేశ్వరరావు, రాఘవమ్మ దంపతులు మంత్రి వద్ద తమ సమస్యను చెప్పుకొన్నారు. తన భార్య రాఘవమ్మ మధుమేహవ్యాధిగ్రస్తురాలు అని గాంగ్రీన్ కావడంతో ఆమె కాలి వేలును సస్త్ర చికిత్స చేసి ఇటీవల తొలగించారని ఆమెకు 5 వేల రూపాయల పింఛన్ దయచేసి ఇప్పిబంచాలని వెంకటేశ్వరావు కోరారు. కిడ్నీ వ్యాధులతో బాధపడే వారికి రూ.10వేల పెన్షన్. ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ఒకే కేటగిరీ కిందకి తెచ్చి నెలకు రూ.5వేలు పెన్షన్ ప్రభుత్వం ఇస్తుందని మంచంపై లేవలేని స్థితిలో వున్నవారికి మాత్రమే ఆ 5 వేల రూపాయల పింఛన్ వస్తుందని వారికి మంత్రి నచ్చచెప్పారు. ఇటీవల కృష్ణా యూనివర్సిటీ రిజిస్టర్ గా నూతనంగా నియమితులైన ఎం.రామిరెడ్డి రాష్ట్ర రవాణా,సమాచార శాఖ మంత్రివర్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని)ని మర్యాదాపూర్వకంగా మంత్రి కార్యాలయంలో పుష్పగుచ్ఛం ఇచ్చారు.
Tags machilipatnam
Check Also
విద్యాసాగర్ పదవీ ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలిరండి…
– ఏపీఎన్జీజీవో నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ పిలుపు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి ఎన్జీజీఒ …