Breaking News

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు నర్వ సన్నద్ధం… : కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లాలోని ఎన్నికలు జరిగిన 41 జడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 19వ తేది ఆదివారం ఓట్ల లెక్కింపునకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ జె. నివాస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యానాథ్ దాస్ కు నివేదించారు.
ఈనెల 19న నిర్వహించనున్న జడ్పీటిసి ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం నగరంలోని సిఎస్ క్యాంప్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యానాథ్ దాస్, జిల్లా కలెక్టర్లు, ఎస్పిలు, జడ్పీసీలకులు, డిపిఓలు తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జె. నివాస్, జాయింట్ కలెక్టర్లు దా.కె. మాధవిలత, కె. మోహన్ కుమార్, విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్, నూజివీడు ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి, జడ్పీసిఇఓ పిఎస్ సూర్యప్రకాశరావు, డిపిట ఏడి. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ జిల్లాలో 16 నియోజకవర్గాలకు సంబంధించి 17 ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూమ్ లను ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఈ మేరకు 17 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోవిద్ నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంత వాతావారణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కౌంటింగ్ సామాగ్రి సిద్ధం చేశామన్నారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యా నాథ్ దాస్ మాట్లాడుతూ ఈ నెల 19న నిర్వహించే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి పలు మార్గదర్శకాలను ఇచ్చారు. కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని సిఎస్ కలెక్టర్లకు స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను, శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు నిర్వహణకు సంబంధించి రాష్ట్ర స్థాయి నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు.

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *