Breaking News

రూ.16.23 కోట్లతో నిర్మించిన ఇరిగేషన్ శాఖ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి పి.అనీల్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతాంగానికి సాగునీటి అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చేవిధంగా రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ పోలుబోయిన అనీల్ కుమార్ అన్నారు.
విజయవాడ ఇరిగేషన్ కాంపౌండ్ లో రూ. 16.23 కోట్లతో నిర్మించిన జలవనరుల శాఖ నూతన కార్యాలయ భవనాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, శాసన సభ్యులు మల్లాది విష్ణుతో కలిసి మంత్రి అనీల్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అనీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. రైతులకు పంట పెట్టుబడి అందించుటతోపాటు శివారు భూములకు కూడా సాగునీటిని అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని మంత్రి అనీల్ కుమార్ అన్నారు. ఇరిగేషన్ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా అధునాతన సౌకర్యాలతో నాలుగు అంతస్తులతో నిర్మించిన ఈనూతన భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఫ్లడ్ మోనటరింగ్ సెల్, కాన్ఫరెన్స్ హాల్, పిపియంయు యూనిట్ తో పాటు ఇయన్ సి ఛాంబరు ఉంటుందన్నారు. మొదటి అంతస్థులో ఇయన్ సి కార్యాలయం, రెండవ అంతస్థులో చీఫ్ ఇంజినీర్ కృష్ణా డెల్టా కార్యాలయం, మూడవ అంతస్థులో చీఫ్ ఇంజినీర్ ఇంటర్ స్టేట్ కార్యాలయం, నాల్గవ అంతస్థులో సి డివిజన్ విజయవాడ, స్పెషల్ డివిజన్ విజయవాడ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అన్నారు. సకాలంలో సాగునీరు అందించేలా ఇరిగేషన్ అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని మంత్రి అనీల్ కుమార్ అన్నారు.
దేవాదాయశాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ప్రజలకు నవరత్నాలు ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేసి ఆర్థికంగా అన్నివిధాల ఆదుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పధకాల వలన రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి వెంటనే నిలుస్తున్నారనేదానికి ఇటీవలే ఎన్నికల ఫలితాలే నిదర్శనం అన్నారు. మండల ప్రజాపరిషత్తు ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వంపై మొగ్గుచూపుతున్నారనే అక్కసుతో ఓట్ల లెక్కింపుపై ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించి ఫలితాలను నిలుపుదల చేయడమే కాక తిరిగి ఎన్నికలు నిర్వహించాలని చూసారన్నారు. అయితే ఇటీవల హైకోర్టు ఓట్ల లెక్కింపు పై స్పష్టమైన తీర్పును ఇచ్చిందన్నారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఈ తీర్పుద్వారా ప్రతిపక్షాలు భంగపడ్డాయన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు వారి తీరును మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నామని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు.
సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ గతంలో వ్యవసాయం దండగన్న ప్రతిపక్షాల మాటను తిప్పికొట్టి రైతాంగానికి దివంగత నేత వై.యస్. రాజశేఖర రెడ్డి పెద్ద పీట వేశారన్నారు. అదేబాటలో రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతుల వద్దకే ప్రభుత్వ సేవలు అందించడంతో పాటు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డికే దక్కిందన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశలో ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారన్నారు.
కార్యక్రమంలో విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటి మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కమిటీ ఛైర్మన్ నాగి రెడ్డి, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, జలవనరుల శాఖా కార్యదర్శి జె. శ్యామలరావు, ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ సి.నారాయణ రెడ్డి, ఇయన్ సి అడ్మిన్ ఆర్. సతీష్ కుమార్, చీఫ్ ఇంజినీర్లు కె. శ్రీనివాసరావు, యం. కుమార్, సూపరింటెండింగ్ ఇంజినీర్లు ఏ. మురళీ కృష్ణా రెడ్డి, వై. శ్రీనివాసరావు, కడియాల రవి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు జి.గోపాల్, శివరామ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *