విజయవాడ నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు,పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కూడా చేపట్టడం జరిగిందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని 18 వ డివిజిన్ కార్పొరేటర్, విఎంసి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం ఆధ్వర్యంలో మాధంశెట్టి సీతారామయ్య వీధి నందు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదుగా దాదాపు కోటి రూపాయల విలువ గల అభివృద్ధి పనులు కు జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవినేని అవినాష్ పూజ కార్యక్రమలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ప్రజానీకం వైసీపీ పార్టీకి మద్దతుగా నిలిచారని కారణంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యనికి గురైన ఈ ప్రాంతంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సంబంధిత మంత్రి, కార్పొరేషన్ వారి సహకరంతో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేపించి అభివృద్ధి పనులు చేయడం ద్వారా మా ప్రభుత్వం మీద పెట్టుకొన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం జరిగిందని అన్నారు. ఇప్పటికే ఇంటి ఇంటికి మంచినీటి కుళాయి లు ఏర్పాటు చేసి మంచినీటి సమస్య పరిష్కారం చేశామని,అదేవిధంగా రోడ్లు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మణాలు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. డివిజన్ లలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని ఉద్ఘటించారు. ప్రజలు ఏ నమ్మకం తో అయితే గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా జగన్ జనరంజకంగా పరిపాలన అన్పిస్తున్నారు. టీడీపీ నాయకులు ఎన్ని డ్రామాలు ఆడిన,ఎంత షో చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని,రాబోయే 30 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని,జగన్ ముఖ్యమంత్రి అని,టీడీపీ పార్టీ ఇక జూమ్ కె పరిమితం అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ,అవుతూ శైలజ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,స్టాండింగ్ కమిటీ మెంబెర్ రామిరెడ్డి మరియు డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.