Breaking News

వాణిజ్య ఉత్సవ్-2021 ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి…

-విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలి…
-జిల్లా కలెక్టరు జె. నివాస్, సిపి బత్తిన శ్రీనివాసులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాణిజ్య ఉత్పత్తులను మెరుగుపరిచి ఎ గువుతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో విజయవాడలో నిర్వహించనున్న వాణిజ్య ఉత్సవ్ – 2021 ను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు.
ఈనెల 21, 22 తేదీలలో యస్ యస్ కన్వెన్షన్ వేదికగా రెండు రోజులు పాటు జరిగే ఈ ఉత్సవ్ లో దుబాయ్, లండన్, ఫ్రాన్స్, బంగ్లాదేశ్, పశ్చిమ జర్మని, తదితర దేశాల రాయబారులతో పాటు 1000 మంది డెలిగేట్స్ పాల్గొననున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యాన్ని అభివృద్ధి చేయుటతోపాటు 2030 నాటికి వాణిజ్య ఉత్పత్తుల ఎగుమతిని 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఈ వాణిజ్య ఉత్సవ్ లో ముఖ్యమంత్రి వివరించనున్నారు. ఈసందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ ఎ క్సపోర్టు యాక్షన్ ప్లాన్ ను ముఖ్యమంత్రి రిలీజ్ చేయనున్నారు. అనంతరం ఎక్స్పర్టు ట్రేడ్ పోర్టల్ ను, వైయస్ఆర్ వన్ బిజినెస్ అడ్వయిజరీ సర్వీసెస్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా యయస్ కన్వెన్షన్ హాలులో ముఖ్యమంత్రి పర్యటనా ఏర్పాట్లను జిల్లా కలెక్టరు జె.నివాస్, పరిశ్రమల శాఖ డైరెక్టరు బాలసుబ్రహ్మణ్యం, విజయవాడ నగర పోలీస్ కమిషనరు బత్తిన శ్రీనివాసులు, అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టరు జె.నివాస్ మాట్లాడుతూ ఇతర దేశాల రాయబారులు, డెలిగేట్స్, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను కలెక్టరు జె. నివాస్ ఆదేశించారు.
పోలీస్ కమిషనరు బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకు అవసరమైన పటిష్టమైన బందోబస్త్ ను ఏర్పాటు చేసామని, ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనే స్టాల్స్ హోల్డర్స్ ను తనిఖీ చేసి ముందుగానే వారి స్టాల్స్ లో ఉండే విధంగా చూడాలని సిపి బత్తిన శ్రీనవాసులు అధికారులను ఆదేశించారు.

Check Also

కలెక్టరేటులో ప్రాజెక్టు కమిటీ ఎన్నిక ఏకగ్రీవం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ నూతన చైర్మనుగా కోడూరు డీసీ చైర్మన్ దేవనబోయిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *