-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
-శ్రీ క్రిష్ణా మెడికల్ డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి
పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
పలాస ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్న కాశీబుగ్గ శ్రీ క్రిష్ణ ఆసుపత్రి వైద్యులు పొందల జగదీష్ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం కాశీబుగ్గ లోని డాక్టర్ పొందల జగదీస్ నిర్వహిస్తున్న ఆసుపత్రి వద్ద శ్రీ క్రిష్ణ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని మంత్రి డాక్టర్ అప్పలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పలాస ప్రాంత ప్రజలు వ్యాధి నిర్ధారణ కొరకు శ్రీకాకుళం, విశాఖపట్నం వెల్లే వాల్లని కానీ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు పొందల జగదీష్, కాళిందిలు ఆలోచన చేయడం ఎంతో సంతోషం అని అన్నారు. వారికి పలాస ప్రాంత ప్రజల తరుపున ధన్యవాదాలు తెలియజేశారు. వ్యాదిని నిర్ధారణ చేసుకున్నప్పుడు రోగికి వైద్యం అందించేందుకు వీలౌతుందని. మెరుగైన వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఒక వైద్యుడుగా ఎన్నో అనుభవాలను నెమరు వేసుకున్నారు. సిటి స్కాన్, ఎమ్మారై, తో పాటు ఇతర వ్యాదులకు శ్రీ క్రిష్ణ వ్యాది నిర్దారణ కేంద్రంలో జరుపడం ఎంతో శుభ పరిణామం పలాస ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.