మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త :
మోపిదేవి లో వేంచేసి ఉన్న శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత నాగ పుట్టలో పాలు పోసి మంత్రి మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మంత్రికి శేష వస్త్రం కప్పి స్వామి వారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, బందరు ఆర్డీవో ఎన్ఎస్ కే ఖాజావలి, డిఎస్పి మహబూబ్ బాషా, తాసిల్దార్ మస్తాన్, ఎంపీడీవో స్వర్ణ భారతి, ఆలయ కార్యనిర్వహణాధికారి లీలా కుమార్, పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
Tags mopidevi
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …