ఆరోగ్యకర వాతావరణానికి పారిశుధ్యం ప్రధానం : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశుభ్రత ఆరోగ్యకర వాతావరణానికి దోహద పడుతుందని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ క్లీన్ ఇండియా ‘ 30 రోజులు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘ క్లీన్ ఇండియా ‘ పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ఆరోగ్యకర వాతావరణానికి పారిశుధ్యం ప్రధానమైనదన్నారు. వ్యక్తిగత, పరిసరాల అపరిశుభ్రత కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, కావున ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. వర్షాకాల సమయంలో ఇంటి పరిసర ప్రాంతాలలో నీరు, చెత్త నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. గ్రామ, పట్టణ ప్రాంతాలలో ఇంటింటికీ వచ్చి చెత్త సేకరణ కార్యక్రమం జరుగుతున్నదన్నారు. పరిశుభ్రత ఆరోగ్యకర వాతావరణం అంశంపై విస్తృత అవగాహన కలిగించి, ప్రజల వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించేలా చేయడమే ‘ క్లీన్ ఇండియా ‘ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ సందర్భంగా ఇంటి వద్దే తడి, పొడి చెత్త వేరు చేసేందుకు గార్బేజ్ సంచులను ఎమ్మెల్యే పంపిణీ చేసారు. కార్యక్రమంలో జెడ్ పి వైస్ చైర్మన్ కృష్ణంరాజు ఎంపిపి ఆరేపల్లి శిరీష ఎంపీడీవో జి రాణి, డిస్టిక్ యూత్ కోఆర్డినేటర్ రాము పోగ్రామ్ కోఆర్డినేటర్ వినోద్ కుమార్, పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *