Breaking News

జనవరి 9న సీఎం పర్యటన నేపథ్యంలో మండపేట నియోజక వర్గంలో క్షేత్ర స్థాయి పరిశీలన ఆర్డీవో కృష్ణ నాయక్

మండపేట, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జనవరి 9వ తేదీన మండపేట నియోజకవర్గంలో నిర్వహించనున్న కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్న నేపథ్యంలో, రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణ నాయక్ మరియు మండపేట శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వర రావు క్షేత్ర స్థాయిలో పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ మాట్లాడుతూ, జనవరి 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా స్థానిక శాసన సభ్యులతో కలిసి రాయవరం, చెల్లూరు గ్రామాల్లో సీఎం సభ ఏర్పాటు కోసం సభ స్థలం, హెలిప్యాడ్ తదితర ఏర్పాట్లపై పరిశీలన చేయడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల సలహాదారు పెందుర్తి వెంకటేష్ మరియు జిల్లా కలెక్టర్ మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలన నిర్వహించి, తుది స్థల నిర్ధారణ చేయనున్నట్లు ఆర్డీవో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *