Breaking News

మన ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం…

తాళ్లపూడి (గజ్జరం), నేటి పత్రిక ప్రజావార్త :
మన ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వమని, ఇచ్చిన హామీ లను అమలు చేయడం తో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్ లు అన్నారు. స్థానికంగా నగజ్జరం గ్రామంలో జరిగిన వైఎస్సార్ ఆసరా రెండో విడత, రహదారి శంఖుస్థాపన కార్యక్రమం లో మంత్రి, పార్లమెంట్ సభ్యులు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గజ్జరం గ్రామంలో లబ్దిదారులకు చెక్కును అందించే కార్యక్రమంలో పాల్గొన్నామన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా వైఎస్సార్ ఆసరా ను దసరా పండగ వేళ ప్రకాశం జిల్లాలో ప్రారంభించారు. దసరా తో పాటు ఆసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. గత ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి 2014 లో అధికారంలోకి వచ్చిన ఇచ్చిన హామీ నెరవేర్చ లేదని, అప్పుడు మోస పోవడమేకాక, అవమానాలు కూడా పడ్డారు. జగనన్న ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించారు. కరోనా విపత్తు సమయంలో కూడా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు. అమ్మఒడి, నాడు నేడు, మధ్యాహ్న భోజన పధకం, వై ఎస్సార్ సంపూర్ణ ఆహార పధకం వంటివి అమలు చేశారు. దిశా చట్టం కేంద్ర ఆమోదం లభించాల్సి ఉండడంతో, అంతకు ముందే దిశా యాప్ తో భద్రత కల్పించాలని చర్యలు చేపట్టామన్నారు. వై ఎస్సార్ చేయూత స్టోర్స్ ద్వారా ఆర్ధికంగా అండగా నిలిచిన విషయం తెలిసిందే అని మంత్రి పేర్కొన్నారు. మీరు ఇచ్చిన దీవేనను మారువ కుండా అన్ని రకాలుగా అండగా నిలిచిన ప్రభుత్వం అనే ఆమె తెలిపారు. గజ్జరం గ్రామంలో 72 గ్రూపులకు చెందిన 711 మంది స్వయం సహాయక సంఘం మహిళల ఖాతాలకు సుమారు రూ.88 లక్షలు 9 వేలు వైఎస్సార్ ఆసరా రెండో విడత సొమ్మును జమచేశామన్నారు.

ఎంపీ – వైఎస్సార్ పార్లమెంటరి పార్టీ ఛీప్ విప్ మార్గాని భరత్ మాట్లాడుతూ, గజ్జరం గ్రామంలో రెండు కార్యక్రమల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా రుణమాఫీ కి హామీ ఇచ్చారు. తొలి విడత గా రూ. 2700 కోట్లు, రెండో విడతగా , 2468 కోట్లను ఈరోజు జమ చెయ్యడం జరిగింది. ఈరోజు రూ.244.84 కోట్ల తో రహదారి నిర్మాణం కోసం శంఖుస్థాపన చేస్తున్నాము, నాలుగు నెలల్లో నిర్మాణం పూర్తి చెయ్యడం జరుగుతుందన్నారు. మీరందరు ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా వృద్ధి చెందలనే లక్ష్యం తో పనిచేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో కూడా మీ మద్దతు ఇవ్వాలని, మరింత సంక్షేమ పథకాలు అమలు చేయడం కి అవకాశం కల్పించాలని కోరారు.

గజ్జరం నుండి గూటాలకు పోవు రహదారి కి శంఖుస్థాపన…
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తాళ్లపూడి మండలం గజ్జరం నుండి గూటాలకు పోవు రహదారి 4.560 కిలోమీటర్లు పనిని రూ.244.84 లక్షలతో చేపట్టే పనికి శంఖుస్థాపన చేశారు. 1.1 కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు, 3.460 కిలోమీటర్లు తారురోడ్డు, 3 పైపు కల్వర్టులు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులకు మంత్రి తానేటి వనిత , ఎంపీ – వైఎస్సార్ పార్లమెంటరి పార్టీ ఛీప్ విప్ మార్గాని భరత్ శంఖుస్థాపన చేశారు. సభకు గజ్జరం సర్పంచ్ గండి రాంబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో తాళ్లపూడి జెడ్పిటిసి/ జిల్లా వైస్ ఛైర్మన్ పోసిన శ్రీలేఖ, ఎంపిపి జొన్నకూటి పోసిరాజు, గజ్జరం ఎంపీటీసీ గుంటు చిన్నాబ్బాయి, తాళ్లపూడి మండల ఎఎంసి వి.శ్రీహరి, డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్,పీఆర్ డీఈ సీహెచ్ మణికుమార్, తాహసీల్దార్ శాంతి, ఎంపీడీఓ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ ఆసరా తో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మా జీవన స్థితి గతులు మెరుగు పరిచారని లబ్దిదారులు పేర్కొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *