విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ కోతలపై దుష్ప్రచారాన్ని ఖండించిన రాష్ట్ర ఇంధనశాఖ ఖండించింది. దసరా పండుగ తర్వాత గ్రామాల్లో, మున్సిపాల్టీల్లో, నగరాల్లో లోడ్ రిలీఫ్ పేరిట గంటలకొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ కొన్ని సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఇంధనశాఖ అధికారులు ఖండించారు. విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఎపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు డిస్కమ్‌లు చర్యలు చేపట్టాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. బొగ్గు నిల్వలు, సరఫరాల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఉన్న పరిణామాలు విద్యుత్ ఉత్పత్తిపై పెను ప్రభావాన్ని చూపుతున్న విషయం అందిరికీ తెలిసిందే. ఇంతటి సంక్షోభ సమయంలోనూ వినియోగదారులకు నాణ్యమైన సరఫరా, కరెంటు ఇచ్చేందుకు రాష్ట్ర విద్యుత్‌పంపిణీ సంస్థలు శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నాయి. ఎలాంటి సమస్యలు లేకుండా విద్యుత్‌ను అందిస్తున్నాయి. సంక్షోభాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యవసర ప్రణాళికల అమలును వెంటనే ప్రారంభించారు. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎపీి జెన్కోకు అత్యవసరంగా రూ.250 కోట్లు నిధులు, బొగ్గు కొనుగోలు నిమిత్తం సమకూర్చబడ్డాయి. రాష్ట్రానికి అదనంగా రోజుకి దాదాపు 8 బొగ్గు రైళ్లు కేటాయించబడ్డాయి. దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడవున్నా కొనుగోలు చేయవలసినదిగా ఎపీి జెన్కోకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి. స్వల్ప కాలిక మార్కెట్ నుంచి ధర ఎంత పలికినా అవసరాల నిమిత్తం కొనుగోలు చేయాల్సిందిగా విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించడం జరిగింది. కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి ఎవ్వరికి కేటాయింపబడని విద్యుత్ వాటా నుంచి, వచ్చే సంవత్సరం జూన్ వరకు, ఆంధ్రప్రదేశ్ కోసం దాదాపు 400 మె.వాట్లు చౌక ధర విద్యుత్ కోసం కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వశాఖకు అభర్ధన పెట్టటం జరిగింది. బొగ్గు సరఫరా కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలతో నిమిత్తం లేకుండా కొరతతో వున్న విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చెయ్యాలన్న కేంద్ర మార్గ దర్శకాలకు అనుగుణంగా మన రాష్ట్రానికి సరఫరా చేసే అన్ని బొగ్గు ఉత్పత్తి సంస్థలతో మాట్లాడటం జరిగింది. పొరుగు రాష్ట్రంలో ఉన్న సింగరేణి సంస్థతో సమన్వయము చేసుకుని మన రాష్ట్రములో వున్న కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా కోసం నిరంతర ప్రయత్నం జరుగుతోంది. విటిపిస్‌లోను మరియు కృష్ణపట్నంలోనూ కొత్త 800 వెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను ప్రారంభించడానికి మరియు తొందరగా అందుబాటులోకి తేవటానికి తగిన చర్యలు తీసుకోవటం జరుగుతోంది.
Tags vijayawada
Check Also
వితరణ అందించే ప్రయత్నం లో స్వచ్ఛందంగా ముందుకు రావాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద దివ్యంగులకు చేయూత నివ్వడం అభినందనీయం అని జిల్లా …