-క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయి..
-ఎమ్మేల్యే దూలం నాగేశ్వరరావు
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థుల్లో మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి, క్రీడలు ఎంతగానో దోహదపడతాయని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు.
మంగళవారం స్థానిక వైవీఎన్ ఆర్ డిగ్రీ కాలేజీలో ఏపీ సీఎం కప్ మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలను రిబ్బన్ కటింగ్ చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైకలూరు వైవీఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో ఈ రోజు ఏపీ సీఎం కప్ పోటీలు, వాలీబాల్, కబడ్డీ పోటీలు ప్రారభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. యువకులకు విద్యతో పాటు ఆరోగ్యవంతమైన క్రీడలు కూడా చాలా అవసరం అన్నారు. చిన్న వయసు నుంచి క్రీడలకు అలవాటు పడితే మంచి ఆరోగ్య వంతులుగా ఉంటారన్నారు. తొలుత కబడ్డీ పోటీలు, వేమవరప్పాడు – కైకలూరు డిగ్రీ కళాశాల వారి జట్లతో ప్రారంభించారు. అదేవిదంగా వాలీబాల్ కైకలూరు జూనియర్ కళాశాల-కైకలూరు డిగ్రీ కళాశాల మధ్య పోటీలను ప్రారంభించారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ బీ. రఘునాధ్ రెడ్డి, ఎంపీడీఓ వెంకటరత్నం, సర్పంచ్ తలారి మాణిమ్మ, జడ్పీటీసీ కురేళ్ళ బేబీ, వైస్ ఎంపీపీ మహ్మద్ జాహిర్,ఉదయ్ ప్రకాష్, పీడీ రవిచంద్ర, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.