-కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు..
-ఎమ్మెల్యే డిఎన్ఆర్
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పథకాలను ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించి అపోహలు లేనివిధంగా అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు.
స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అడవి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సర్వ సభ సమావేశంలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే డిఎన్ఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డిఎన్ఆర్ మాట్లాడుతూ నూతనంగా కొలువుతీరిన మండల పరిషత్ కార్యవర్గానికి అభినందనలు తెలువుతున్నానని అన్నారు. ప్రత్యేకాధికారుల పాలన కాలంలో వచ్చిన వివిధ ప్రభుత్వ గ్రాంట్ లను జాగ్రత్తగా నిల్వ ఉంచి, ఇప్పుడు మండల పరిషత్ గ్రాంట్ కి, గౌరవ ఎంపీ గ్రాంట్ మరియు స్వల్పంగా గ్రామ పంచాయతీల గ్రాంట్ మాచ్ చేసి మండలంలోని గ్రామ పంచాయతీ లకు నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ తన ఎంపీ లాడ్స్ నుండి కేటాయించిన కోటి రూపాయలు కూడా కైకలూరు మండలానికే ఇవ్వడం జరిగిందని అన్నారు. మండలంలో 19 పంచాయతీల్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వడం జరిగిందని అన్నారు. త్వరలోనే కొన్ని రోడ్లు మంజూరు తేవడం జరుగుతుందని అన్నారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన జగనన్న శాశ్వత గృహ హక్కు పధకం గురించి గ్రామాల్లో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ముందుగా అవగాహన కల్పించి,లబ్ధిదారులకు అర్ధం అయ్యేరీతిలో చెప్పి పథకాన్ని విజయవంతం చెయ్యవలసిన బాధ్యత సర్పంచ్, ఎంపిటిసి సభ్యులదే నని అన్నారు.ఓటీఎస్ విధానం ద్వారా గృహ హక్కును పొందే విధానం యొక్క ఆవశ్యకతను, దానివల్ల కలిగే లబ్దిని లబ్ధిదారులకు వివరించాలని అన్నారు. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సేవలు అందించాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరత్నం, తాహశీల్థారు రాంబాబు, జడ్పీటీసీ కూరెళ్ల బేబీ, వైస్ ఎంపీపీ మహ్మద్ జహీర్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, షేక్ రఫీ, డ్రైనేజీ డీఈఈ శిరీష, ఆడబ్ల్యూఎస్ డీఈ శాస్త్రి, ఆడబ్ల్యూఎస్ ఏఈ నాగబాబు, ఆర్అండ్ బీ ఏఈ, డ్రైనేజీ ఏఈ ఇందిరా, ఎంపీటీసీలు సర్పంచ్ లు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.