-గ్రామాల్లో చెరువులు అభివృద్ధి జరిగేలా ఉపాది పనులు చేపట్టాలి…
-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖా, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
-మన ఊరు మన చెరువు కార్యక్రమం పై సమీక్షించిన మంత్రి
పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాల్లో చెరువులు బాగు చేసుకోవడం ద్వారా నీటి నిల్వలను పెంచుకుని సాగు నీటికి ఇబ్బంది లేకుండా చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖా, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస లో జాతీయ ఉపాది హామి పధకం కార్యాలయంలో సోమవారం అధికారాలతో మన ఊరు మన చెరువు కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఉపాది హామి పధకం ద్వారా నిర్వహిస్తున్న మన ఊరు మన చెరువు కార్యక్రమంలో భాగంగా చెరువులు బాగుచేయాలని అన్నారు. గ్రామీణ ప్రజల ఉపాదిని పెంచుతూ వారికి అవసరమైన వాటిని అభివృద్ధి చేసుకునే విదంగా ప్రణాలికలు రూపొందించాలని అన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వు మహాత్మ గాంధి జాతీయ ఉపాది హామీ పధకం ద్వారా ప్రజల మౌళిక సదుపాయాలు మెరుగుపర్చడం తోపాటు ఉపాది అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని అన్నారు. ఇందులో భాగంగానే మన ఊరు మన చెరువు అనే కార్యక్రమం ద్వారా చెరువు పూడిక తీతలు చేయడం చెరువు గట్లు దృడం చేసుకోవడం, తోపాటు చెరువులు లోతు చేసుకుంటే సాగు నీటికి నీటి నిల్వలను పెంచుకోవడానికి అవుతుందని అన్నారు. మన ఊరు మన చెరువు ద్వారా నియోజకవర్గంలో ని అన్ని గ్రామాల్లో చెరువులు ఉపాది హామీ పనులు ద్వారా బాగుచేసుకోవటం తోపాటు ఉపాది అందించాలని కోరారు. అంతేకాకుండా గ్రామాల్లో రహదారి ప్రక్కన ఉన్న చెరువులలను సుందరీకరణ చేసుకోవాలని సూచించారు. గ్రామ ప్రజల ఆరోగ్యానికి మార్నింగ్ వాకింగ్ కు వీలు కల్గేలా రహదారి ప్రక్కన ఉన్న చెరువులు మొక్కలు నాటి వాకింగ్ ట్రాక్స్ వేసుకుని అభివృద్ధి చేసుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. మెటీరియల్ కాంపోనెంట్ నిధుల ద్వారా అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యాలు తోపాటు రహదారులు అభివృద్ధి చేసుకునేలా చర్యలు చేపడుతూ అధికారులు ప్రణాళికలు చేపట్టాలని మంత్రి కోరారు. అంతే కాకుండా నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్.ఐ.సి) వెబ్ సైట్ ప్రారంభం సందర్భంగా ఆ వెబ్ సైట్ ద్వారా ఏఏ గ్రామాల్లో ఉపాది హామీ ద్వారా జరుగుతున్బ పనుల పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డుమా పీడీ హనుమంతు కుర్మారావు, పలాస AMC చైర్మన్ పీవీ సతీష్, పలాస జడ్పీటీసీ మచ్చ రత్నాలు ధనరాజు, PACS అధ్యక్షులు పైల వెంకటరావు, ఎంపీపీ ప్రతినిధి ఉంగ సాయికృష్ణ, మందస వైస్ ఎంపీపీ సీర ప్రసాద్, పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాల ఎంపీడీఓ లు, APO లు, APD రమణ, NREGS సిబ్బంది పాల్గొన్నారు.