Breaking News

గిరిజన ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా…

కుక్కునూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజన ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, పోలవరం ప్రాజెక్టు పునరావాస కాలనీల్లో చక్కటి మౌలిక సదుపాయాల కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. రెండు రోజుల పాటు ఏజెన్సీ ప్రాంతంలో పర్యటనలో భాగంగా శనివారం రెండో రోజు కుక్కునూరు మండలం లో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ పర్యటన నకు వచ్చినా జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ కి కుక్కునూరు ఎంపిపి టి. రాజేష్, సర్పంచ్ ఆర్. మీనా, తదితరులు ఘన స్వాగతం పలికారు.స్థానిక సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన ప్రజల నుంచి వాటిని ఎంతో ఓపికగా విని పరిష్కారానికి సానుకూల దృక్పథం వ్యక్తం చేసిన తీరుపై ప్రజలు ఎంతో సంతృప్తి వ్యక్తపరిచారు. తాము విన్నవించుకున్న విషయాలపై కలెక్టర్ స్పందించిన తీరు పై వారు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక ప్రజలు పేర్కొన్న సమస్యలు పై స్పందించి, ప్రతి ఒక్క సమస్య ను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని, అవసరమైన చర్యలలో భాగంగా ప్రభుత్వం నుంచి తగిన అనుమతులు మంజూరు కి కృషి చేస్తానని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హామీ ఇచ్చారు. కుక్కునూరు గ్రామంలో ని పి.హెచ్.సి. కి రెగ్యులర్ డాక్టర్లను నియమించాలని, వెటర్నిటీ హాస్పిటల్ లో వైద్యుల ను నియమించాలని, పురుగు ఆశించి దెబ్బతిన్న ప్రత్తి, మిరప లకు తగిన పరిహారం చెల్లించాలని రైతులు, ఇసుక లభ్యత , మున్నూరు కాపు ల విద్యార్థులు ధ్రువపత్రం విషయంలో అవసరమయిన చర్యలుతిసుకోవలని స్థానికులు కోరారు. అర్జా శృతి దివ్యాంగురాలే కాకుండా మానసిక, శారీరక సంబంధం సమస్యా లతో బాధ పడుతున్న దృష్ట్యా ప్రస్తుతం అందిస్తూన్న మూడువేల రూపాయల పెన్షన్ సదుపాయం పెంచలాని,తగిన ఆర్ధిక చేయూత కై వారి తల్లి చేసిన విజ్ఞప్తి పై స్పందించిన కలెక్టర్ ఎంపీడీఓ సుబ్బరాయన్ ను తగిన ప్రతిపాదనలు పంపమని కలెక్టర్ ఆదేశించారు. ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో, నాన్ ట్రైబల్ కి సంబంధించిన సమస్యలను ఫిబ్రవరి చివరినాటికి పరిష్కరించి, గ్రామ సభ నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఐటిడిఎ పిఓ కు కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఐటీడీఏ పిఓ ఆనంద్ పనితీరు పై కలెక్టర్ ముందు సంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నమని, ఆర్ అండ్ ఆర్ కాలనీ ల్లో చక్కటి మౌలిక సదుపాయాల కోసం చర్యలు తీసుకున్నమని తెలిపారు. పిహెచ్ సి లోనే గర్భిణీ లు డెలివరీ జరిగేలా చూడాలని ఆదేశించారు. డెలివరీ రూమ్, ఆపరేషన్ థియేటర్,ల్యాబర్ రూమ్, పరిశీలించారు. మలేరియా, డెంగ్యూ కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఒపి సంఖ్య పెరగాలని అదే మన పనితీరుకు నిదర్శనం అన్నారు. రైతు సమస్యలపై పూర్తి స్థాయి లో అండగా ఉంటామన్నారు. ఇసుక సమస్య పై ఐటిడిఎ పిఓ తో మాట్లాడడం జరిగిందని, మీ కోసం ప్రత్యేక ఇసుక రీచ్ అందుబాటు లో ఉంచడం జరుగుతుందని,వారంలో సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.

హర్షిత, నవ్య తదితర విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి :
గిరిజన ప్రాంతంలో బాలుర కంటే బాలికలు ఎంతో చురుగ్గా ఉంటూ ఆకట్టుకున్నారని కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ ప్రశంసించారు. పర్యటన లో భాగంగా స్థానిక కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు పాఠ్యాంశాల పై బాలికలకు వున్న విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు ఆయన పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.పలువురు బాలికలను మీరు ఏమి కావాలని అడిగిన ప్రశ్నలకు డాక్టర్ కావాలని, ఇంజనీర్, హిందీ టీచర్ కావాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆశయం ఉంటే సరిపోదని, అవి సాధించేందుకు సరైన లక్ష్యం ,గురి ఉండాలన్నారు. పాఠ్య పుస్తకాలు చదవడం ముఖ్యం అని, అదేవిధంగా విశ్వ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులు ను అన్ని రకాలుగా తగిన ప్రోత్సాహిం చాలని ఉపాధ్యాయులను పేర్కొన్నారు. పిల్లలకు ఆసక్తి ఉన్న రంగాల్లో తగిన ప్రోత్సాహకాలు అంద చెయ్యడం పై చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ పర్యటన లో కలెక్టర్ వెంట పిఓ ఐటిడిఎ ఓ. ఆనంద్, ఐటిడిఎ డిడి పి. వెంకటేశ్వరరావు, తహసీల్దార్ జయరాం, ఎంపీడీఓ ఆకుల సుబ్బారాయన్, డిప్యూటీ డి.ఎమ్ .హెచ్.ఓ డా.మురళీకృష్ణ, మెడికల్ ఆఫీసర్ సందీప్,సమగ్ర శిక్ష అభియాన్ ఏపిసి శ్యామ్, జిసిడివో సభియ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *