-ప్రముఖ సినీ హీరో సుమన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ నేపధ్యం లో ఆత్యాదునికంగా తెరకెక్కించిన “పల్లె గూటికి పండగొచ్చింది” తెలుగు సినిమా సూపర్ హిట్ అవుతుంది అని ప్రముఖ సినీ హీరో సుమన్ వెల్లడించారు. విజయవాడ హోటల్ ఐలాపురం లో పల్లె గూటికి పండగొచ్చింది సినిమా ప్రమోషన్ లో బాగంగా ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రజల జన జీవన స్థితిగతులు మారుతున్న ప్రపంచ పరిస్తితుల నేపధ్యం లో పల్లె లో ఉన్న యువత సరయిన దారిలో తన ఆలోచనలని మార్చగాలిగితే దేన్నయినా మార్చగలరనే ఇతివృత్తం తో సినిమా సాగింది అన్నారు. స్వచ్చ భారత్ అంటే దేశమే కాదు దేశ ప్రజల హృదయాలు కుడా స్వచ్ఛత వైపు పయనించాలని ఈ సినిమా ద్వారా దర్శకులు తెలియజేసారు అని అన్నారు.యువత సన్మార్గంలో ప్రయనిస్తే దేశ అభివృద్ధి ఏ విదంగా ముందుకు సాగుతుందో ఈ సినిమాలో అనేక పాత్రలద్వారా చూపించడం జరిగింది. పూర్తి స్థాయి కుటుంబ నేపధ్యంలో, పల్లె వాతావరణం, ప్రకృతి అందాల మద్య ఈ సినిమా చిత్రీకరణ జరిగిందని ప్రతి వ్యక్తి తప్పక కుటుంబం తో చూడాల్సిన ఒక సందేశాత్మక చిత్రం అని సుమన్ అన్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే – దర్శకత్వం అందించిన కంచరాన తిరుమలరావు మాట్లాడుతూ ఈ చిత్రం మొత్తాన్ని పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లోనే చిత్రించామని, నటీనటులు చిత్రీకరణ సమయంలో సహకరించారన్నారు.తల్లి తండ్రి గురువుతో పాటు రైతు సిపాయి కుడా మనకు దైవ సమానులే అనే ఇతివృత్తం తో మంచి సందేశాత్మకంగా కమర్షియల్ ఎలివేట్స్ మిస్ కాకుండా ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు చిత్రీకరించామని తెలిపారు. అలాగే సంగీత దర్శకులు సిందు కే ప్రసాద్ ద్వయం ఈ చిత్రానికి అద్బుతమయిన సంగీతాన్ని అందించారని, పాటలను వైవిధ్య భరితంగా ప్రముఖ గాయిని గాయకులతో ఆణిముత్యాల్లాంటి పాటలని అందించారని తెలియజేసారు.ఈ చిత్రానికి సంగీతం అందించిన సిందు కే ప్రసాద్ మాట్లాడుతూ మాకు అవకాసం కల్పించిన నిర్మాత దర్శకులకు కృతజ్ఞత తెలియజేస్తూ మంచి పాటలు చేయడానికి అనుకులమయిన సందర్బాలను అవకాశాన్ని దర్శకులు కల్పించారని మంచి క్వాలిటీ తో కూడిన ఆడియో రావడానికి నిర్మాత, దర్శకులు మాకు ఎంత గానూ తోడ్పాటు అందించారని తెలియజేసారు. శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ ఇందులో యువతకు మంచి సందేశాన్ని ఇచ్చే పాట తానూ రాసానని మళ్లీ విజయోత్సవ సభ ఇదే విజయవాడ లో జరుపుతామని ఆశా భావం వ్యక్తం చేసారు. అంతేకాకుండా ఈ సినిమా యొక్క ప్రత్యేకతపై రెండు రాష్ట్రాలలోను కవితా మహోత్సవాలు నిర్వహిస్తామని తెలియజేసారు. తారాగాణం సుమన్, సాయి కుమార్, షియాజీ షిండే , రఘుబాబు, అన్నపూర్ణమ్మ, బండ రఘు, జబర్దస్త్ అప్పారావు, రాజమౌళి, జగదీశ్వరి తదితరులు. ఈ సమావేశం లో చిత్ర యూనిట్, డ్రీమ్ స్వచ్చంద సేవాసంస్థ చైర్మన్, ఎమ్ఆర్ పియస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేదర సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.