Breaking News

జగనన్న విద్యా దీవెన పథకం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా జిల్లాలో 79 వేల 639 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 70 కోట్ల 40 లక్షల 11 వేల 870 రూపాయలు జమ తద్వారా 89,582 మంది విద్యార్థులకు లబ్ధి.
రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్‌` డిసెంబర్‌ 2021 త్త్రెమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో 709 కోట్లను బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సచివాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా జమ చేశారు.
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకం కింద ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెల్లించిన మొత్తం 9,274 కోట్లు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్‌ బకాయిలు 1,778 కోట్ల రూపాయలను కూడా చెల్లించింది.
జగనన్న విద్యా దీవెన దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్థులందరికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌. ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకండా ఏ త్త్రెమాసికానికి ఆ త్త్రెమాసికం అయిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి. పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదని, ముఖ్యమంత్రి జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నారు.ప్రతీ పేద వాడు ఉన్నత విద్యను కొనసాగించడానికి ఆర్థిక భరోసాతో ప్రొత్సహించడం జరిగింది.
నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌ డా.కె.మాధవీలత, జాయింట్‌ కలెక్టర్‌ (సంక్షేమం) కె.మోహన్‌కుమార్‌, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఏపి ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ గౌతమ్‌రెడ్డి, సాంఫీుక సంక్షేమ శాఖ డిప్యూటి డైరెక్టర్‌ కె. సరస్వతి, బిసి సంక్షేమ శాఖ డిప్యూటి డైరెక్టర్‌ లక్ష్మిదుర్గ, ఏపిఎస్‌ఆర్‌టీసి రీజనల్‌ డైరెక్టర్‌ తాతినేని పద్మావతి, విశ్వబ్రహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ టి శ్రీకాంత్‌, బట్రాజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గీతాంజలిదేవి తదితరులు ఉన్నారు. అనంతరం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా జిల్లాలో 79 వేల 639 మంది విద్యార్థుల తల్లుల ఖాతాకు 70 కోట్ల 40 లక్షల 11 వేల 870 రూపాయలు జమ చేసే చెక్‌ను అందించారు.

జగనన్న విద్యా దీవెన పై లబ్ధిదారుల మనోభావాలు:
ట్రిపుల్‌ఐటీ తన లాంటీ పేద విద్యార్థలకు వరం: వి.సింధూర
నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో రెండవ సంవత్సరం బిటెక్‌ ఇంజనీరింగ్‌ చదువు కుంటున్న వి. సింధూర మాట్లాడుతూ తమది మధ్యతరగతి కుటుంబమని గత సంవత్సరం తన తండ్రి పక్షవాతానికి గురి అయ్యారని ఆ సమయంలో తన చదువును మధ్యలోనే అపేద్దాం అనుకునే సమయంలో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన తనకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. తన లాంటి పేద విద్యార్థులు ఉన్నత ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించేందకు ట్రిపుల్‌ఐటీ కళాశాలను స్థాపించారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్థాపించిన ట్రిపుల్‌ఐటీ కళాశాలలో గ్రామీణ ప్రాంతంలో చదువుకుంటున్న ఎంతో మంది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.

కుటుంబమంతా జగనన్నకు రుణపడి ఉంటాం: పి సాయి
మాచవరం ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సివిఆర్‌ కళాశాలలో డీగ్రీ రెండవ సంవత్సరం చదువు కుంటున్న పి సాయి మాట్లాడుతూ తాను ఇంటర్‌ మీడియట్‌ చదువుతుండగా తన కుంటుబ ఆర్థిక పరిస్థితులు బాగోలేని సమయంలో తనకు అమ్మఒడి పథకం ద్వారా వచ్చిన 15 వేల రూపాయలలను కళాశాలకు చెల్లించి తన చదువును పూర్తి చేసుకున్నానన్నారు.ఆ తరువాత డీగ్రీలో చదువుతుండగా తన నాన్నమ్మ గుండె అపరేక్షన్‌ చేయించడానికి వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఒక్కరోజులోనే లక్ష రూపాయలు అందయాని వాటితో అపరేషన్‌ చేయించామని ప్రస్తుతం తన నాన్నమ్మ ఆరోగ్యంగా వుందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పవేశ పెట్టిన పథకాలతో తాను డీగ్రీ చదువుకుంటున్నానన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం గానే ఉన్నప్పటికి విద్యార్థులు చదువుకుంటే రాష్ట్ర భవిష్యత్‌ ఉన్నతంగా వుంటుందని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

జగనన్నకు హృదయపూర్వక వందనాలు:అనూష
మాచవరం ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సివిఆర్‌ కళాశాలలో డీగ్రీ రెండవ సంవత్సరం చదువుకుంటున్న అనూష మట్లాడుతూ తన తండ్రి ఆటో డ్రైవర్‌ అని తనది పేద కుంటుబం మరియు ఆర్థిక పరిస్థితి బాగోలేక తన చదువును మధ్యలో అపేద్దాం అనుకునే సమయంలో జగనన్న విద్య దీవెన ద్వారా తన చదువును కొనసాగిస్తున్నానని, ఈ పథకం ద్వారా మేలు చేస్తున్న జగనన్నకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానని అన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *