విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగ నియామకాలపై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించిన్నట్లు జిల్లా యువజన సంక్షేమాధికారి యు శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం గుడ్లవలేర్లు ఎఎఎన్‌యం అండ్ వివిఆర్ ఎస్ ఆర్ పాలిటెక్నిక్ కళాశాలనందు, మధ్యాహ్నం గుడివాడ వికెఆర్‌అండ్ విఎస్‌బి పాలిటెక్నిక్ నందు ఎయిరేమెన్ సెలక్షన్‌సెంటర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సికిందరాబాద్ వారిచే ఎయిర్ ఫోర్స్ నందు ఉద్యోగనియామకాలపై కమాండిరగ్ ఆఫీసర్‌శ్రీ సజ్జాశ్రీ చైతన్య విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారన్నారు. సదస్సులో కమాండిరగ్ అధికారి ఎయిర్‌ఫార్స్‌నందు యువతకు అందుబాటులో ఉన్న అవకాశముల గురించి వివరంగా ఉద్బోధించారన్నారు. అవగాహన కార్యక్రమములలో గుడ్లవల్లేరు కళాశాల ప్రిన్సిపల్ డీన్‌ఎన్ సీతారామజనేయులు, గుడివాడ వికెఆర్ ్‌అండ్ విఎస్‌బి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్స్ హాజరయ్యారని, జిల్లా యువజన సంక్షేమాధికారి యు శ్రీనివాసరావు తెలిపారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …