విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆలిండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. విజయవాడ గాంధీనగర్ లో ని ప్రెస్క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భారతదేశంలోని దళిత క్రైస్తవుల రాజ్యాంగ హక్కులను హరింప చేసిన 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 3 ను రద్దు చేయాలని కోరారు. క్రైస్తవ మతం తీసుకున్న క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని వ్యవస్థాపక అధ్యక్షులు విజయ రాజు కోరారు. భారతదేశంలో దళితులు బౌద్ధ సిక్కు మతాలు తీసుకుంటే వారికి ఎస్సీ హోదా పోవడం లేదని క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీ హోదా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలోని న్యాయస్థానాలు మతం మారిన కులం మారదు అని తీర్పు ఇవ్వడం గతంలో జరిగిందని తెలియజేశారు. మా న్యాయమైన కోర్కెలను చట్టసభల్లో తగు నిర్ణయాలు తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని కేంద్రానికి సిఫార్సు చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో లో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాయకులు లూధర్ ప్రశాంత్ చాట్ల, జె స్టీవెన్, సురేంద్రబాబు, డాక్టర్ నాగేంద్ర కుమార్, డాక్టర్ అశోక్ కుమార్ , జాన్ డానియల్, మత్తిరాజు కుమార్, బిషప్ డాక్టర్ జోసెఫ్ ఆండ్రూస్, రాజశేఖర్ చాట్లా, కొండ్రు సతీష్, మద్దా
కొర్నేలియాస్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …