-విద్యా రంగానికి బడ్జెట్ లో 16 శాతం నిధులు కేటాయింపు..
-ప్రతి మండలంలోనూ రెండు జూనియర్ కళాశాలల ఏర్పాటు..
-రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యా రంగానికి రాష్ట్ర బడ్జెట్ లో 16 శాతం నిధులు కేటాయించి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
విజయవాడ సింగ్ నగర్ లోని ఎమ్ కె. బేగ్ ఉన్నత పాఠశాల నందు నిర్మించిన అదనపు తరగతి గదులను గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ 50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఎంకె బేగ్ హైస్కూలులో 1.50 కోట్లతో అభివృద్ది పనులు పూర్తి చేయగలగడం అభినందనీయం అన్నారు. గత 50 ఏళ్లలో ఈ హైస్కూలుకి కనీస సౌకర్యాలు కూడా గత ప్రభుత్వం కల్పించకపోవడం దురదృష్టకరం అన్నారు.
టాయిలెట్స్ సౌకర్యం లేని కారణంగానే గతంలో విద్యార్ధినుల డ్రాప్ అవుట్స్ పెరిగినట్లు సర్వేలో వెల్లడైందని అన్నారు. తమ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు పోటీ పడుతున్నారని అన్నారు. పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కలుగచేయడానికే నాడు-నేడు చేపట్టామన్నారు. పిల్లలని స్కూళ్లకి పంపాలంటేనే భయపడే పరిస్ధితులకి గత ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. పేదరికం విద్యకి అడ్డుగా ఉండకూడదు…నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలని ఆలోచించిన వ్యక్తి సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లని 16 వేల కోట్లతో అభివృద్ది చేస్తున్నామని మంత్రి అన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా సిఎం వైఎస్ జగన్ పాలన కొనసాగిస్తున్నారని మంత్రి కొనియాడారు. బడ్జెట్ లో 16 శాతం నిధులని విద్యకి కేటాయించారంటే విద్యకి సిఎం ఎంత ప్రాదాన్యతనిచ్చారో అర్దమవుతోందన్నారు. గత మూడేళ్లలో లక్ష కోట్ల రూపాయిలని విద్యా శాఖకి కేటాయించామన్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా నాడు నేడులో పాఠశాలల అభివృద్ది చేస్తున్నాం అని మంత్రి అన్నారు. మద్యాహ్న భోజనంలో సమూల మార్పులు తీసుకొచ్చి జగనన్న గోరుముద్ద తీసుకువచ్చాం అని మంత్రి తెలిపారు. వారానికి అయిదు సార్లు గుడ్లు, మూడు రోజులు చిక్కీలు…రోజుకొక రకమైన పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. పారదర్సకంగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తే తమపై ప్రతిపక్షం విషం చిమ్ముతోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు. ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం అని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో 2024 నాటికి పదవ తరగతి విద్యార్ధులు సిబిఎస్ఇ పరీక్షలు రాసేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సాంకేతిక పరిజ్ణానాన్ని ఉపయోగించుకుని ఓటిటి ద్వారా విద్యాబోదన…ఈ మేరకు సిఎం ఆదేశాలు జారీ చేశారని మంత్రి తెలిపారు. అమ్మ ఒడి మంత్రి అని నన్ను పిలుస్తుంటే ఆనందంగా ఉందని మంత్రి ఆనందం వ్యక్తం చేసారు. జగనన్న అమ్మ ఒడి చాలా గొప్ప పధకం…ఈ పధకంతో సిఎం వైఎస్ జగన్ చరిత్రకెక్కారని తెలిపారు. ప్రతీ మండలంలో రెండు జూనియర్ కళాశాలలు…ఇందులో ఒకటి ప్రత్యేకంగా బాలికల కోసం ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.
ఈ సమావేశంలో విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్ ఎల్ సి ఎం డి. రుహుల్లా, తదితరులు పాల్గొన్నారు.