-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖా, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.
-తాత్కాలిక భవనంగా పలాస డుమా కార్యాలయ భవనం.
-ఎనిమిది మండలాల నాయకులు,కార్యకర్తలు పాల్గొనాలి.
-పరిపాలన వికేంద్రీకరణ, జిల్లాల తోపాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాలను ప్రారంభించనున్న సీఎం.
పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజనకు సోమవారం ముహూర్తం కరారైందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖా, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు.సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. జిల్లా విభజన సందర్భంగా రెవెన్యూ డివిజన్లు కూడా ప్రారంభం కావడంతో శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా ఏర్పడనున్న పలాస రెవెన్యూ డిజన్ ను ప్రారంభించుకోవడం శుభసూచికం అని అన్నారు. పలాస రెవెన్యూ డివిజన్ లో నందిగాం, వజ్రపుకొత్తూరు, మందస,పలాస,సోంపేట,కవిటి,కంచిలి,ఇచ్చాపురం తోపాటు ఇచ్చాపురం,పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ లతో కొత్త డివిజన్ ఏర్పాటు చేసి పరిపాలన జరుగుతుందని తెలిపారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని డుమా కార్యాలయ భవనంలో తాత్కాలికంగా విధులు నిర్వాహన జరగబోతుందని అన్నారు.డివిజన్ ప్రజలకు ఒక గొప్ప అపూర్వమైన అవకాశం కావడంతో ఎనిమిది మండలాల ముఖ్య నాయకులు,పంచాయతీ సర్పంచ్ లు,ఎంపిటీసి లు,జెడ్పీటిసిలు,ఇతర ప్రభుత్వ ప్రతినిధులు,అధికారులు, పాలకులు అందరు కలసి పెద్ద పండగలా ఈ ప్రారంబోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు. పలాస ను పాలనా విభాగంలో ఎంతో అభివృద్ధి దిశగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పలాస నియోజకవర్గం ప్రజల తరుపున,డివిజన్ ప్రజల తరుపున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు,ప్రజలు,కార్యకర్తలు పెద్దెత్తున హాజరుకావాలని మంత్రి కోరారు