– రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రానికే గాక దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి
-వ్యవసాయ యాంత్రీకరణకు 1900 కోట్ల రూ.లు ఖర్చు చేస్తున్నాం
-త్వరలో సియం చేతుల మీదగా 3500 ట్రాక్టర్ల పంపీణీకి ఏర్పాట్లు
-2014-19 ఆత్మహత్య చేసుకున్న469 మంది రైతు కుటుంబాలకు చెల్లించాల్సిన 23.45కోట్ల రూ.లు బకాయిలు చెల్లింపు
-పంటల బీమా కింద 6.18లక్షల మంది రైతులకు రూ.715 కోట్లు పింపిణీ
-రాష్ట్ర వ్యవసాయశాఖామాత్యులు కాకాణి గోవర్ధన రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంక్షేమానికై అమలు చేస్తున్న రైతు భరోసా కేంద్రాలు గత రెండేళ్ళగా సత్ఫలితాలను ఇస్తున్నాయనేందుకు రైతు భరోసా కేంద్రాలు ఐక్యరాజ్య సమితిలో అనుబంధ విభాగమైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ) ప్రతిష్టాత్మక ఛాంపియన్ అవార్డుకు నామినేట్ కావడమే నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ, సహకార,మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు. బుధవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు నేడు రాష్ట్రానికి,దేశానికే గాక ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు.రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్నఅనేక సంక్షేమ కార్యక్రమాల పట్ల అనేక రాష్ట్రాలు యావత్తు దేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని పేర్కొన్నారు.ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఆరు అవార్డులు ప్రకటిస్తే వాటిలో ఆంధ్రప్రదేశ్ నుండి రైతు భరోసా కేంద్రాలు నామినేట్ కావడం ఆనందదాయకని పేర్కొన్నారు.ఎఫ్ఏఓ ప్రకటించిన ఆరు అవార్డుల్లో ఎపి నుండి ఆర్బీకెలు,ఒడిస్సా నుండి వాటర్ షెడ్డు పధకం కూడా అవార్డుకు నామినేట్ కావడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 10 వేల 778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కాగా వాటిలో 5 వేల 945 ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.నేడు రైతు భరోసా కేంద్రాలు రైతులకు అన్ని విధాలా ఎంతో ఉపయోగపడుతున్నాయని ముఖ్యంగా విత్తనాలు,ఎరువులు, పురుగు మందులు వంటివి వీటి ద్వారానే రైతులకు పంపిణీ జరుగుతోందని చెప్పారు.రాష్ట్రంలో 12 లక్షల 57 వేల 830 మంది రైతులకు 4 లక్షల 75 వేల 166 మెట్రిక్ టన్నుల ఎరువులు,29 లక్షల 30 వేల 184 మంది రైతులకు 15 లక్షల 96 వేల క్వింటాళ్ళ విత్తనాలు పంపిణీ చేశామని తెలిపారు.అంతేగాక లక్షా 50 వేల 822 మంది రైతులకు లక్షా 36 వేల 443 లీటర్ల పురుగు మందులను పంపిణీ చేసినట్టు చెప్పారు.2021-22 కాలంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా 10 లక్షల 3 వేల 281 మంది రైతులకు 3 లక్షల 68 వేల 204 మెట్రిక్ టన్నుల ఎరువులు,15 లక్షల 25 వేల 356 మంది రైతులకు 8 లక్షల 96 వేల క్వింటాళ్ళ విత్తనాలు,లక్షా 49 వేల 975 మంది రైతులకు లక్షా 35 వేల 546 లీటర్ల పురుగు మందులను పంపిణీ చేసినట్టు మంత్రి గోవర్ధన రెడ్డి వివరించారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అనగా 2014-19 మధ్య 469 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారికి చెల్లించాల్సిన నష్ట పరిహారం 23 కోట్ల 45 లక్షల రూ.ల బకాయిలను ఈప్రభుత్వం వచ్చాక చెల్లించడం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి గోవర్ధన రెడ్డి చెప్పారు.అదే విధంగా ఈప్రభుత్వం వచ్చాక అనగా 2019 జూన్ నుండి ఇప్పటి వరకూ 694 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారికి 48 కోట్ల 58 లక్షల రూ.ల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించడం జరిగిందని తెలిపారు.అలాగే పంటల బీమా కింద గత ప్రభుత్వ హయాంలో 6 లక్షల 18 వేల మంది రైతులకు చెల్లించాల్సిన 715 కోట్ల రూ.ల బకాయిలను కూడా ఈప్రభుత్వం వచ్చాక చెల్లించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.అదే విధంగా గత ప్రభుత్వం రైతు రధం కింద చెల్లించాల్సిన 124 కోట్ల 65 లక్షల రూ.ల బకాయిలకు గాను ఇప్పటికే 82 కోట్ల రూ.లను చెల్లించినట్టు చెప్పారు.గత ప్రభుత్వ 2014-19 కాలంలో రైతులకు చెల్లించాల్సిన వడ్డీలేని ఋణాలకు సంబంధించి 1073 కోట్ల రూ.ల బకాయిలకు గాను 3లక్షల 9 వేల 500 మంది రైతులకు ఇప్పటికే 784 కోట్ల 72 లక్షల రూ.లను చెల్లించామన్నారు.ఎపి మైక్రో ఇరిగేషన్ పధకం కింద గత ప్రభుత్వ కాలంలో 735 కోట్ల రూ.ల బిల్లులు చెల్లించాల్సి ఉండగా ఈప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 630 కోట్ల రూ.లను చెల్లించిందని ఇంకా 105 కోట్ల రూ.లను చెల్లించాల్సి ఉందని చెప్పారు.అదే విధంగా ఈప్రాజెక్టుకు సంబంధించి 748 కోట్ల రూ.ల బిల్లులు అప్లోడ్ చేయగా ఇప్పటికే 322 కోట్ల రూ.లు చెల్లించగా ఇంకా 426 కోట్ల రూ.లు చెల్లించాల్సి ఉందని వ్యవసాయ శాఖామంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణకు 1900 కోట్ల రూ.లు ఖర్చు చేస్తున్నట్టు మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి చెప్పారు.దీనిలో భాగంగా రైతులకు అవసరమైన స్ప్రింక్లర్లు,హార్వెస్టర్లు, ట్రాక్ట్రర్లు వంటి యంత్రాలను అందిస్తున్నామని చెప్పారు.త్వరలో 3500 ట్రాక్టర్లను ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదగా పంపిణీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. రైతుల నుండి రైతు భరోసా కేంద్రాల ద్వారా పెద్దఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతోందని ఇప్పటికే 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. గతంలో ఎన్నడూలేని రీతిలో వ్యవసాయ అభివృద్ధి రైతు సంక్షేమానికి వినూత్న రీతిలో అనేక పధకాలు,కార్యక్రమాలను అమలు చేస్తున్నఈప్రభుత్వాన్నివిమర్శించడం గాని వ్యవసాయం,రైతుల గురించి మాట్లాడే హక్కు గాని ప్రతి పక్షాలకు లేదని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రైతు భరోసా కేంద్రాల సంయుక్త సంచాలకులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.