-ప్రోబేషన్ ప్రక్రియ ప్రారంభించినందున రాష్ట్ర ముఖ్యమంత్రికు కృతజ్ఞతలు
-జూన్ 30 లోగా ప్రోబేషన్ ప్రక్రియ పూర్తి ఐతే ముఖ్యమంత్రికు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి సచివాలయాల శాఖ ద్వారా సచివాలయ ఉద్యోగులతో కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తాం : గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి జనవరి7వ తేదీన చేసిన ప్రకటన ప్రకారం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ జూన్ 30లోపు డిక్లేరేషన్ ప్రక్రియ పూర్తిచేసి కొత్త పి.ఆర్.సి ప్రకారం పెరిగిన వేతనాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన మాట ప్రకారం, ప్రోబేషన్ డిక్లరేషన్ కు సచివాలయాల శాఖ రాష్ట్ర డైరెక్టర్ సగిలి.షన్ మోహన్ పేరిట సోమవారం సచివాలయాల శాఖ జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రలో నిలిచిపోయే సువర్ణ అధ్యాయానికి నాంది పలుకుతూ సరికొత్త నూతన వ్యవస్థకు శ్రీకారం చుడుతూ 15004 గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి లక్షా ముప్ఫయి నాలుగు వేల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమయ్యింది. ఎందరో కలలో సైతం ఊహించని ఉద్యోగాలు ప్రభుత్వం సృష్టించడంతో కొంతమంది స్వార్ద రాజకీయాల కోసం ఈ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కాదనే దుష్ప్రచారానికి శ్రీకారం చుడుతూ గత రెండున్నర సంవత్సరాలుగా ఉద్యోగులను మనోవేదనకు గురిచేశారు. ఈ క్రమంలో ఉద్యోగుల ప్రోబేషన్ డిక్లరేషన్ మరియు పేస్కేల్ అనే అంశం ఉద్యోగుల ఆర్ధిక అవసరాలు మరియు ఆత్మగౌరవానికి సంభందించిన అంశంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో మే నెల ప్రారంభం అయిపోయిందని ప్రోబేషన్ ప్రక్రియ గురించి ఆందోళనలో ఉన్న సచివాలయ ఉద్యోగులకు సచివాలయాల శాఖ ఇచ్చిన ఆదేశాలు సంతోషాన్ని నమ్మకాన్ని కలిగించాయని జాని పాషా తెలిపారు. అలాగే జూన్ ముప్ఫయి లోగా ప్రోబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తి ఐతే సచివాలయాల శాఖ ద్వారా సచివాలయ ఉద్యోగులతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రికు కృతజ్ఞత సభ నిర్వహిస్తామని ఎం.డి.జాని పాషా ఈ సందర్బంగా తెలియజేసారు.