Breaking News

ఘనంగా సౌత్ ఆఫ్రికా మహానాడు వేడుకలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరుపుకుంటున్న సందర్భంలో అన్న ఎన్టీఆర్‌ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ సందర్భంగా సౌత్‌ ఆఫ్రికాదేశంలో టిడిపి ఎన్‌ఆర్‌ఐ శాఖ ఘనంగా మహానాడు వేడుకలు 14 మేన జోహన్స్‌బర్గ్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి భారతదేశం నుంచి ప్రత్యేకంగా మాజీ మంత్రి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జ్‌ జవహర్‌ మరియు తెలుగుదేశం జనరల్‌ సెక్రెటరీ గౌతు శిరీష హాజరయ్యారు. సౌత్‌ ఆఫ్రికాలో ఉన్న వివిధ నగరాల నుంచి టీడీపీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గౌతు శిరీష మాట్లాడుతూ జన్మభూమి విధానాన్ని ప్రవేశపెట్టి ఇప్పుడు కొనసాగింపుగా గ్లోబల్‌ ఫారం ఫర్‌ సస్టైనబుల్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రత్యేక అంశంగా అందరూ గుర్తించి ముందుకు నడిపించాలని పేర్కొంటూ ఎన్‌ఆర్‌ఐ టీడీపీసభ్యత్వాలు మీద గౌతు శిరీష తీర్మానం ప్రవేశపెట్టారు. జవహర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఎన్నారై టీడీపీ కార్యకర్త రానున్న ఎన్నికల్లో పార్టీకి అందుబాటులో ఉండాలని అదేవిధంగా పార్టీ కూడా ప్రతి ఒక్క ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సమస్యల మీద స్పందిస్తుందని తెలియజేస్తూ ఎన్‌ఆర్‌ఐ టీడీపీని బలోపేతం చేయడానికి అన్నిరకాలుగా పార్టీ సంసిద్ధంగా ఉన్నదని పార్టీ భవిష్యత్తులో చేయబోయే సహకారాలు మీద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జవహర్‌ పిట్ట కథలతో సభను రక్తికట్టించారు. ఈ సమావేశంలో ప్రత్యేకంగా జూమ్‌ ద్వారా ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సెల్‌ ఇంఛార్జి చప్పిడి రాజశేఖర్‌ మాట్లాడుతూ ఈ విభాగం యొక్క విధి విధానాలను వివరిస్తూ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సభ్యత్వాలను నమోదు చేసుకోవలసిందే గా కోరారు. అదే జూమ్‌లో కొవ్వూరు నుండి దివ్యాంగురాలు లావణ్య లక్ష్మీ మాట్లాడుతూ తెలుగుదేశం అధికారంలోకి ఎందుకు రావాలో దానికి తానే ప్రత్యక్ష నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్‌ ఆఫ్రికా ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అధ్యక్షుడు రామకృష్ణ పార మాట్లాడుతూ గతంలో ఎన్నో రకాల సదుపాయాలు ప్రభుత్వాలు అందజేయగా ఇప్పటి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రవాసాంధ్రుడు సౌకర్యాలు కల్పించడంలో ముందు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొమ్మినేని మురళి గుమ్మడి శ్రీరాములు ఇందిరా, రాధా మోహన్‌, ఆనంద్‌, ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సౌత్‌ ఆఫ్రికా కౌన్సిల్‌ మెంబర్లుతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 30వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *