-రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
-గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం చేపడుతున్న అభివృద్ధి పై వివరణ
-నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఆధునిక హంగులతో అల్లుకోల ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం
పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
పలాస మండలం అల్లుకోల పంచాయతీ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక పాడిపారిశ్రామికాభివృద్ది మరియు మత్స్య శాఖ మాత్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు, ప్రతి ఇంటి గడపకు వెళ్లి ప్రభుత్వం వారికి అందిస్తున్న సహకారం మరియు సంక్షేమ ఫలాలు గూర్చి వివరించారు, కుల, మత, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులందరికీ సంక్షేమం అందించడమే జగనన్న ప్రభుత్వ ద్వేయం అని అన్నారు, నాడు నేడు కార్యక్రమంలో భాగంగా నూతన హంగులతో నిర్మాణం చేప్పట్టిన ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం చేసి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఆయనతో పాటు స్థానిక సర్పంచ్ దువ్వాడ వామక్షి రవికుమార్, ఎంపీటీసీ తలగాన శ్రీరాములు, ఎంపీపీ ఉంగ ప్రవీణ, పీ.ఏ.సీ.యస్ అధ్యక్షులు పైల చిట్టిబాబు, వైసీపీ జిల్లా ప్రధానకార్యదర్శి ఉంగ సాయి కృష్ణ, వైసీపీ నాయకులు చింతాడ మాధవరావు, గొర్లె వేణుగోపాల్, మామిడి నరసింహమూర్తి, ఎంపీడీఓ, ఎమ్మార్వో, అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.