మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. పద్మ గురువారం న్యాయ సేవాసదన్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 6న స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ కాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా డిఎల్ఎస్ఎ కార్యదర్శి మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 31 నుండి నవంబర్ 13 వరకు జిల్లా వ్యాప్తంగా Pre-mature release of prisoners కాన్సెప్ట్ తో ఒక campaign జిల్లాలో అన్ని జైళ్ళలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో గల 8 జైళ్ళలో ఖైదీల వివరాలు సేకరించి, వారు ఏ నేరంలో ఎంతకాలంగా ఉంటున్నారు, వారికి ప్రీ మెచ్యూర్ రిలీజ్ కు అవకాశం ఉందా అనే దానికి సంబంధించిన వివరాలు సేకరించడం జరుగుతుందన్నారు. పౌరులందరికీ ఎవేర్నెస్ కల్పించి ఎంపవర్ చేయాలనే ఉద్దేశంతో Empowerment of citizens through out reach programs అనే మరో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు, ఇందులో భాగంగా ఈనెల 6వ తేదీన స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ క్యాంప్ ఉదయం 10 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమ నిర్వహణకు చేయవలసిన ఏర్పాట్లపై గురువారం న్యాయ సేవాసదన్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ సంక్షేమ శాఖల అధికారులు వారి శాఖల ద్వారా వారు అమలు చేస్తున్న పథకాలపై స్టాల్స్ ఏర్పాటు చేయాలని, వివిధ పథకాల కింద లబ్ధిదారులకు పథకాల మంజూరు పత్రాలు, రుణాలు పంపిణీ ఏర్పాట్లు కూడా చేయాలన్నారు స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలని అన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డిఆర్వో ఎం వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పీఎస్ఆర్కే ప్రసాద్, డిఎల్ఎస్ఎ సభ్యులు లంకిశెట్టి బాలాజీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
Tags machilipatnam
Check Also
డిసెంబర్ 30 వ తేదీ సోమవారం యధాతధంగా కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్ కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి పి జి …