Breaking News

జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలయ్యేందుకు సహకరించాలి !!… : రాష్ట్ర ఆహార కమిషన్‌ చైర్మన్‌

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన పేదలందరికీ ఆహార భద్రత కల్పించడానికి ఆంధ్ర ప్రదేశ్ ఆహార కమిషన్ పనిచేస్తున్నదని, జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు అయ్యేందుకు అధికారులు సహకరించాలని కమిషన్ చైర్మన్ సి.హెచ్. విజయ ప్రతాప రెడ్డి అన్నారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని స్పందన సమావేశపు మందిరంలో జాతీయ ఆహార భద్రత చట్టం 2013 అవగాహన సదస్సును వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా చట్టం-2013 ప్రకారం ఆకలి మరణాలు ఉండకూడదని ఈ దిశగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల ద్వారా అర్హులైన వారందరికీ బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తున్నామని ఆయన ఆన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహార కమిషన్ రాష్ట్రంలో ఆగస్టు 7 వ తేదీ 2017 నుండి పనిచేస్తున్నదన్నారు. ఆహార కమిషన్ చైర్మన్ గా ఇంతవరకూ 19 జిల్లాలలో పర్యటించి సుమారు 400 సెంటర్ లను తనిఖీ చేసి కొన్ని ప్రాంతాలలో జరుగుతున్న లోటుపాట్లను గుర్తించి చర్యలు తీసుకున్నామన్నారు.
గత రెండు రోజులుగా కృష్ణాజిల్లాలో పెనమలూరు , పోరంకి, ఉయ్యూరు , వక్కలగడ్డ, చల్లపల్లి, మోపిదేవి, మచిలీపట్నం, పాతేరు, రుద్రవరం, పోలాటితిప్ప గ్రామాలను పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రతకు అమలు చేస్తున్న పధకాల ద్వారా నిరుపేదలైన లబ్ది దారులకు అందుతున్న ప్రయోజనాలను పరిశీలించడం జరిగందన్నారు.ఆహార భద్రతకు సంబంధిత పథకాలైన ప్రజాపంపిణీ వ్యవస్థ, మహిళా, శిశు అభివృద్ధి సంస్థ అమలు చేస్తున్న పధకాలు, మధ్యాహ్న భోజన పధకం, సంక్షేమ హాస్టర్ విద్యార్థులకు భోజన, వసతులు, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పధకం అమలుపై కమిషన్ అన్ని జిల్లాల్లోనూ సమీక్షించి తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ పథకాలకు సంబంధించి ఎటువంటి లోటుపాట్లు ఉన్నా సవరించడం, సంబంధిత అధికారులను అప్రమత్తం చేయడం, తప్పులు ఎక్కువగా ఉన్నచో సుమోటోగా తీసుకుని కేసులు పెట్టడం, జరిమానా విధించడం, అవకతవకలకు పాల్పడిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు సిఫారసు చేయడం ఆహార కమిషన్ ముఖ్యమైన విధి విధానాలని చైర్మన్ విజయ ప్రతాప రెడ్డి పేర్కొన్నారు. ఏం ఎల్ ఓ పాయింట్ డీలర్లు వచ్చి కొనుగోలు చేయడం లేదని అలాగే పెనమలూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో రేషన్ దుకాణాల వద్ద గరీబ్ కళ్యాణ్ యోజన బియ్యం గూర్చి బోర్డులు పెట్టడం లేదని, వక్కలగడ్డ గ్రామంలో రేషన్ దుకాణంలో కందిపప్పు 2022 జూలై నెల స్టాక్ ఉండటం గమనించామన్నారు. దేశాయిపేటలో నూనె ప్యాకెట్లపై మే నెల 2022 స్టాక్ ఉందన్నారు.నవంబర్ 22 వ తేదీతో అవి ఎక్స్పైర్ డేట్ ఉందన్నారు. 6 నెలల క్రితం పంపిణి చేయాల్సినవి ఇప్పుడు అక్కడ ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అలాగే పోరంకిలో రెండు అంగన్వాడీ కేంద్రాలు ఒకే చోట నిర్వహిస్తున్నారని హాజరు శాతం 51 ఉందని ఆప్ లో ఏ అటెండెన్స్ ఉందొ అదే రిజిస్టర్ మాన్యుల్ అదే ఉండాలని , ఏదైనా పిర్యాదు వస్తే, పైనుంచి ప్రింటు తీసుకోని వస్తామని, భవిష్యత్తులో లబ్ధిదారుల ఇళ్లకు సైతం వెళ్లి వారు ఎప్పుడెప్పుడు వెళ్లారో తెల్సుకుంటామన్నారు. అంగన్వాడీ టీచర్లు, సూపెర్వైజర్లు , సిడిపిఓలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే పాతేరు గ్రామంలో గుడ్లు సరిగా ఇవ్వడం లేదని పిర్యాదు తమకు వచ్చిందని, తీరా తాము అక్కడకు వెళితే, ఆ పిర్యాదు అవాస్తవమని అర్ధం అయిందన్నారు.
ఆహార భద్రతకు సంబంధించిన సమస్యలను గానీ, జరుగుతున్న అవకతవకలు గానీ కమిషన్ దృష్టికి తీసుకు రావచ్చునని చైర్మన్ అన్నారు. ఫిర్యాదులు పంపే వారు తగిన ఆధారాలు ఫోటోలు వీడియోలు జతచేసి వాట్సాప్ నెంబరు 9490551117 కు పంపించాలని, ఫోన్ చేసి ఫిర్యాదు చేయగోరేవారు టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 2388 నకుగానీ ఫోన్ చేసి తెలియజేయవచ్చునన్నారు. అలాగే ఈ మెయిల్ apstatefoodcommission@gmail.com కు ఫిర్యాదు చేయవచ్చునన్నారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణకిషోర్, ఉపసంచాలకులు పి.సురేష్, డి ఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఐ. కీషో ర్, డి ఎస్ ఓ కె. పార్వతి, ట్రైనీ కలెక్టర్ చైతన్య, డిఇఓ తాహేరున్నీసా బేగం, డిఎంహెచ్ఓ జీ. గీతాబాయి, ఐసిడిఎస్ పి డి ఎస్. సువర్ణ, సాంఘిక సంక్షేమశాఖ డిడి కె. సరస్వతి పలు శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Check Also

సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 30వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *