మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజహితం కోరి మీడియా రంగంలో అందిస్తున్న విశేష సేవలకు గాను ప్రశంసిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్ ) రాష్ట్ర సంఘ అధ్యక్షులు బడే ప్రభాకర్ ను తెలంగాణ హైకోర్టు జడ్జి ఇవి వేణుగోపాల్ ఘనంగా సత్కరించారు. శాలువాతో సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. సోమవారం సికింద్రాబాద్ సప్తగిరి హోటల్లో సీకె నాయుడు స్పోర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు లక్కాకుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఇవి వేణుగోపాల్ ఈ మేరకు మచిలీపట్నం వాసి ప్రభాకర్ ను అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తోలి మహిళా క్రికెట్ కెప్టెన్, మహిళా క్రికెట్ కోచ్ కొండా మంజులా కిషోర్, కొండా దేవయ్య ,కాసారం రమేష్, తాడివాక రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 30వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల …