-మంత్రి జోగి రమేష్
చిన ఆకులమన్నాడు ( గూడూరు ), నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుస్థిరంగా, సుభిక్షంగా ఉంచే శక్తి ఆయనకు మాత్రమే ఉందని జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అఖిలాంధ్ర ప్రజానీకం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలోని గూడూరు మండలం చిన ఆకులమన్నాడు గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైంది. ఆయన అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి మంత్రి జోగి రమేష్ ప్రతి ఇంట్లో ఆ కుటుంబానికి వివిధ పథకాల ద్వారా అందిన ఆర్థిక సహాయం వివరాలను తెలియజేయడంతో పాటు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత ఆయన కొమ్మన విజయలక్ష్మి, ఊటుకూరి నాగ వెంకట శివ ప్రవీణ్, పిచ్చుక దాక్షాయణి, భూసం శారద, బట్ట నాగేశ్వరమ్మ, పేరిశెట్టి శ్యామలంబ, బళ్ళా బసవేశ్వర రావు, వాక నాగ పుష్పావతి, ఉక్కెం కోట సుబ్బమ్మ, మేడక ధనలక్ష్మి, ఊటుకూరి నాగశ్యామల, మరకా పరమేశ్వరి, రావూరి కృష్ణకుమారి, ఉదయగిరి స్వప్న, ప్రోవి వెంకటేశ్వరరావు, ఊటుకూరి తులసి, మరకా సుజాత తదితరుల ఇళ్లను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా పలువురి గ్రామస్తులతో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, సమస్యల పరిష్కారానికి, సంక్షేమ పథకాల అమలు తీరుకు సంబంధించి ప్రతి ఒక్కరినీ కలిసేందుకు, వారి యోగ క్షేమాలతో పాటు ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయమై వివరిచేందుకు ఉద్దేశించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని, అందరం ఐక్యంగా మున్ముందుకు పయనిద్దామని మంత్రి జోగి రమేష్ పిలుపునిచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో గూడూరు మండల జెడ్పిటీసి వేముల సురేష్ రంగబాబు, గూడూరు ఎంపిపి సంగా మధుసూదనరావు, ఆకులమన్నాడు ఎంపీటీసీ కోళ్ల లక్ష్మణరావు, మండల పార్టీ అధ్యక్షుడు తలుపుల వెంకట కృష్ణారావు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు, గూడూరు పిఏసీఎస్ అధ్యక్షులు తలుపుల కృష్ణారావు, ఆకులమన్నాడు ఆర్బికే చైర్మన్ బీరం రాజా, పెడన 3వ వార్డు కౌన్సిలర్ బళ్ళా గంగయ్య, గూడూరు తహసీల్దార్ బి విజయ ప్రసాద్, ఎంపీడీవో డి. సుబ్బారావు, ఆకులమన్నాడు పిఏసిఎస్ చైర్మన్ ఫైజుల్ రహమాన్ (మున్నా) , ఎజ్జు వెంకయ్య నాయడు, గోరిపర్థి రవి వివిధ శాఖల అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.