-కలెక్టర్ రంజిత్ బాషా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణాన్ని కాపాడడంతో పాటు మత్స్య సంపదను పెంపొందించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు.
సోమవారం ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో స్థానిక నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ, కొన్ని అధ్యయనాల ప్రకారం సముద్రపు చేపల వల్ల ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయని వెల్లడైందన్నారు. ఎన్నో రకాల అనారోగ్యాలను తట్టుకునే శక్తి కూడా సముద్రపు చేపలు అందిస్తాయని తెలిపింది ఓ పరిశోధన అన్నారు. ఎందుకంటే చేపల చెరువుల్లో వాటిని పెంచే యజమాని పెట్టి ఆహారాన్నే చేపలు తింటాయిని చెబుతూ. ఆ ఆహారాన్ని బట్టి చేపల్లోనూ పోషకాలు పెరుగుతాయి కానీ సముద్రంలో స్వేచ్ఛగా తిరిగే చేపలు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను ఇచ్చే మొక్కలను తింటాయి. సముద్రపు అడుగున ఉండే మొక్కల్ని తినే చిన్నచేపల్ని, పెద్ద చేపలు ఆరగిస్తాయి. పెద్ద చేపల్ని వాటికన్నా పెద్ద చేపలు తింటాయి. అలా మొక్కల నుంచి వచ్చే పోషకాలు కూడా సముద్రపుచేపల్లో లభిస్తాయి. కాబట్టి సీఫుడ్ చాలా మంచిదని కలెక్టర్ అన్నారు. కృష్ణాజిల్లా లోని మొత్తం 25 మండలాలలోని 4 తీర ప్రాంత మండలాలలో 111 కిలోమీటర్ల సముద్రతీరం ఉందని, మొత్తం 37,348 ఎకరాలలో మంచినీటి చేపల పెంపకం, 51,440 ఎకరాలలో ఉప్పునీటి చేపలు రొయ్యల పెంపకం జరుగుచున్నట్లు తెలిపారు. 2021-22 సంవత్సరానికి 13.76 లక్షల టన్నుల చేపల, రొయ్యల ఉత్పత్తి జరిగినందుకు గాను రూ. 17527.07 కోట్ల బి.వి.వి. రావడమైనదని వివరించారు. అలాగే కృష్ణాజిల్లాలో వేలాది మత్స్యకారులకు 2022-23 వేట నిషేధ భృతి క్రింద 11,850 మందిని అర్హులుగా ప్రతిపాదించగా, 13.05.2522 న నవరత్నాలు పథకం వై.యస్.ఆర్ మత్స్యకార భరోసా ద్వారా మొదటి విడతలో 9,940 మందికి ఒక్కొక్కరికి రూ.10,000/- చొప్పున మత్స్యకారుల బ్యాంక్ ఖాతాలోకి నేరుగా జమచేయడమైనది. మిగిలిన 975 మందికి 2 వ దశలో వారి అర్హతననుసరించి ది.19,07,22 వ తేదిన వారి ఖాతాలో జమ చేయబడినట్లు చెప్పారు. మొత్తం లబ్దిదారుల సంఖ్య 9,940 + 975 తో కలిపి 10,915 మందికి ఆ సహాయం అందినట్లు చెప్పారు. సముద్రంలో 2 నెలల వేటనిషేధ కాలంలో కుటుంబంలో ఒక మత్స్యకారునికి రూ.10,000/- అందజేసినట్లు తెలిపారు. అలాగే నవరత్నాలు పథకం వై.యస్.ఆర్ మత్స్యకార భరోసా క్రింద మొత్తం 1,813 వేట చేయు మోటరైజ్డ్ బోట్లకు నెలకు 300 లీ. చొప్పున, మేకనైజ్డ్ బోట్లకు నెలకు 3000 లీ. చొప్పున డీజిల్ ఆయిల్ కొనుగోలు పై చోటుకు లీటరుకు ను రూ.9/- చొప్పున స్మార్ట్ కార్డుల ద్వారా ముందస్తు సబ్సిడీ అందజేసినట్లు తెలిపారు. పర్యావరణ అసమతుల్యత వల్ల జలవనరుల్లో మత్స్యసంపద తరిగిపోతున్నందున అందరికీ దీనిపై అవగాహన కల్పించి వారి సూచనలు, సలహాలతో మత్స్య సంపదను పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో యునైటెడ్ నేషన్స్ నవంబర్ 21వ తేదీని ప్రపంచ మత్స్య దినోత్సవంగా గుర్తించిందన్నారు. ఈ మత్స్య దినోత్సవం 1997 సంవత్సరం నుండి జరుపుకుంటున్నామన్నారు. ప్రపంచం జీవరాశికి ఆహారాన్ని సమకూర్చే ప్రధాన సంపదల్లో మత్య్స సంపద ఒకటన్నారు. . మత్స్యకారుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్రప్రభుత్వం మత్స్యకారులకు అందచేస్తున్న వివిధ అభివద్ధి పథకాలను మత్స్యకారులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
బందరు హార్బర్ శరవేగంగా పూర్తవుతుందన్నారు సముద్ర ముఖద్వారం వద్ద ఇసుక మేటల తొలగింపుతోపాటు ఎగుమతి, దిగుమతి సౌకర్యాలు, పరిపాలనా భవనం, మత్స్యకారులకు విశ్రాంతి గదులు, రేడియో కమ్యూనికేషన్ టవర్, బోట్ బిల్డింగ్, ఐస్ ప్లాంట్లు, దాదాపు 350 మర పడవలు లంగరు వేసుకోవడానికి అనువుగా కీవాల్ విస్తరణ, రక్షిత మంచినీటి సరఫరా, తదితర సౌకర్యాల కల్పనకు ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. తర్వాత జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పల హారిక ప్రసంగిస్తూ, వెనకబడిన తరగతులకు వెన్నుదన్నుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలుస్తున్నారన్నారు. మత్స్యకారులను ప్రోత్సహించడం కోసం, మత్స్య పరిశ్రమ ను నిర్వహించడం కోసం చేప పిల్లల పంపిణీ చేయడం, ఆక్వా రంగానికి చేయూతనివ్వడం అన్ని రాష్ట్రాలు చేసే పనే అయినప్పటికీ, మత్స్య పరిశ్రమలో ఉన్న రైతులు ఉత్పత్తి చేసిన చేపలను మార్కెటింగ్ చేయడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ప్రత్యేకమైన దృష్టిసారించిందన్నారు. పోషక విలువలు ఎక్కువగా ఉండే చేపలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆక్వా రైతులు సాగు చేసే స్వచ్ఛమైన చేపలు మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తే ప్రజల్లోనూ చేపలపై ఆసక్తిని పెంపొందించడం సాధ్యమవుతుందని ప్రభుత్వం భావించడం ఎంతో అభినందనీయమని ఆమె అన్నారు.
అనంతరం మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ, వెనకబడిన తరగతుల ప్రజలకు ఈ ప్రభుత్వం ఎంతో బాసటగా నిలిచిందన్నారు. తాను ఒక సాధారణ మత్స్యకార మహిళనని తనను మచిలీపట్నం నగరపాల సంస్థకు మేయర్ గా ఎంపిక కావడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గొప్ప మనసు ఉదాహరణ అన్నారు. మన రాష్ట్రానికి ఆక్వా పరిశ్రమ అక్షయ పాత్ర వంటిదని రాష్ట్రంలో వ్యవసాయం, మత్స్య పరిశ్రమ మన ఆహారంలో అన్నం కూర వంటివని ఆమె అభివర్ణించారు తర్వాత, జిల్లా మత్స సహకార సొసైటీ అధ్యక్షులు చింతా గోవిందరాజులు మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా జగనన్న ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మత్స్యకారులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయని అన్నారు. శాస్త్రవేత్తలకు మత్స్యకారులకు మధ్య విజ్ఞాన సాంకేతికత విషయాల్లో పరస్పర సహకారం ఎంతో అవసరమన్నారు. తద్వారా మత్స్యకారుల ఆదాయ వనరులు పెంపొందించబడతాయన్నారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ తంటిపూడి కవితా థామస్ నోబుల్, కష్ణాజిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఎన్ శ్రీనివాసరావు, బందు డివిజన్ ఆర్డీవో ఐ. కిషోర్, 20 వ డివిజన్ కార్పొరేటర్ తిరుమలశెట్టి ప్రసాద్, మున్సిపల్ కో- ఆప్షన్ మెంబర్ మట్టా తులసమ్మ, పలువురు ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారులు, జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.