Breaking News

రిజిడ్ బ్రాంకోస్కోపీ పై మణిపాల్ హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ మీట్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ వైద్యరంగంలో విశిష్ఠ సేవలు అందించిన విజయవాడ లోని మణిపాల్ హాస్పిటల్స్ “రిజిడ్ బ్రాంకోస్కోపీ” పై ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ మీట్ ను ఆదివారం నిర్వహించింది. నగరంలోని ఫార్చ్యూన్‌ మురళీ పార్క్‌ లో ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధులు అయిన ఎంతో మంది వైద్యులు ‘రిజిడ్ బ్రాంకోస్కోపీ’పై సెషన్ల వారిగా చర్చించారు. ముఖ్యంగా ‘రిజిడ్ బ్రాంకో స్కోపీతో పాటుగా కాంప్లెక్స్ ఎయిర్‌వే ఇంటర్వెన్షన్స్’ పై చర్చించినట్లు నిర్వాహకులు తెలిపారు. వీటితో పాటు రిజిడ్ బ్రాంకోస్కోపీ ఇంట్యూబేషన్, హాట్ అండ్ కోల్డ్ థెరపీ ఆన్ యానిమల్ పోర్సిన్ మోడల్స్‌ కు సంబంధించిన కొన్ని కేసులపై కూడా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు చర్చించారు.

డాక్టర్ సుధాకర్ కంటిపూడి- హాస్పిటల్ డైరెక్టర్, ఆర్గనైజింగ్ కమిటీ – డాక్టర్ లోకేష్ గుత్తా – కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ & డా. ఉదయ్ కిరణ్ – జి. కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్ మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “నాణ్యమైన చికిత్స అందించడానికి, రిజిడ్ బ్రాంకోస్కోపీ చికిత్సపై అవగాహన స్థాయిలను పెంచడానికి సంబంధించిన ప్రయత్నం భాగంగా మణిపాల్ హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ మీట్ ను నిర్వహించింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రతీ పల్మోనాలజిస్టులందరిలో అవగాహన పెంచే లక్ష్యంగా నిర్వహించాము. ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీకి సంబంధించిన నిపుణులు ప్రత్యేక ప్రెజెంటేషన్లు, చర్చలు, వర్క్‌ షాప్‌లు, వీడియో ప్రెజెంటేషన్‌లను ఇచ్చారు. అంతేకాకుండా వివిధ సమస్యలపై కూడా ఈ మీట్ లో చర్చించారు. దీంతో ఈ మీట్ కు హాజరైన వారు సాంకేతికంగా మరింత గొప్ప అనుభూతిని పొందారు.’’ అని అన్నారు.

పల్మోనాలజీకి సంబంధించి ఇటు వైద్యరంగ నిపుణులు, అటు పరిశోధక వైద్యులు అందరిని ఈ మీట్ ఏకం చేసింది. దీని ద్వారా ఇంటర్ డిసిప్లినరీ పద్ధతిలో ప్రతి సెగ్మెంట్ నుంచి ఎంచుకోవడానికి అనేక ట్రాక్‌లతో రూపొందించారు. వైద్యరంగ ప్రముఖులు, విద్యాసంస్థల్లోని అధ్యాపకులతో పాటు ఇతర సహచరులు కలవడంతో శాస్త్రీయ నెట్‌వర్క్‌ ను ఏర్పరచడానికి ఈ మీట్ అవకాశాన్ని కల్పించింది. ఈ కార్యక్రమం రియల్ వర్క్ స్టేషన్ల ద్వారా యువ పల్మోనాలజిస్ట్‌లకు వ్యాధి-నిర్దిష్ట నైపుణ్యాలను బోధిస్తూనే ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీలో భవిష్యత్తును అన్వేషించింది.

ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ అనేది పల్మనాలజీ (ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత) ఔషధ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఊపిరితిత్తులు, శ్వాసనాళాల ప్రాణాంతక, నాన్-మాలిగ్నెంట్ రుగ్మతలను నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి అత్యంత అధునాతనమైన మినిమల్లీ-ఇన్వాసివ్ విధానాలను ఇది అందించింది.

Check Also

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పణ…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, అన్నవరం, తూర్పు గోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *