Breaking News

జిల్లాకు చెందిన డా . బాణావతు తేజస్వికి ప్రధాన మంత్రితో కలిసి పెరేడ్ ను తిలకించే అవకాశం

-తేజస్వినిని అభినందించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జోధ్ పూర్ ఎయిమ్స్ లో జనరల్ మెడిసిన్ నందు మాస్టర్ డిగ్రీ పూర్తీచేసిన జిల్లాకు చెందిన బాణావతు తేజస్వినికి రాజధాని న్యూ ఢిల్లీలో అత్యంత వైభవంగా నిర్వహించే గణతంత్రదినోత్సవ వేడుకలను భారత ప్రధాన మంత్రి తో కలిసి వీక్షించే అవకాశం రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు.
కేంద్రప్రభుత్వం నుండి ప్రధాన మంత్రితో కలిసి గణతంత్రదినోత్సవం లో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్న డా . తేజస్విని గురువారం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ను ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పెరేడ్ లో పాల్గొనే అవకాశం గురించి తెలియజేశారు . ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర పన్నుల శాఖలో డిప్యూటీ అసిస్టెంట్ కమీషనర్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న బి. బి. వెంకటేశ్వరావు కుమార్తె డా. తేజస్వి ప్రధాన మంత్రి బాక్స్ నుండి గణతంత్ర వేడుకలను వీక్షించేందుకు 50 మంది ప్రతిభ వంతులైన విద్యార్థులు ఎంపికయ్యారన్నారు . వీరిలో నగరం లోని గుణదల ఎన్టీఆర్ కాలనీ కి చెందిన డా. తేజస్విని ఎంపిక కావడం అభినందనీయమన్నారు . న్యూ ఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద గల ప్రధాన మంత్రి బాక్స్ నుండి గణతంత్రదినోత్సవ వేడుకలను వీక్షించే అవకాశం కల్పిస్తూ భారత మంత్రిత్వ ఉన్నత విద్య శాఖ నుండి ఆహ్వానం అందుకున్నా డా . తేజస్వి ప్రభుత్వ సిద్దార్ధ వైద్య కళాశాలలో ఏం బి బి ఎస్ విద్యను పూర్తి చేసి ప్రతిభ కనుపరచి విద్యార్థిగా డా. పి వెంకటేశ్వరరావు డా. రంగం సత్యనారాయణ శేష రామ్ మెమోరియల్ గోల్డ్ మెడల్ అవార్డు , ఉప్పల సత్యనారాయణ బయో కెమిస్ట్రీ గోల్డ్ మెడల్ అవార్డులను అందుకున్నారన్నారు . ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ నందు జనరల్ మెడిసిన్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉత్తమ విభాగం లో డా. పరుచూరి బ్రహ్మయేశ్వరావ్ గోల్డ్ మెడల్ అవార్డును అందుకున్నారన్నారు . తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా, తల్లి సామాన్య గృహిణి గా బాథ్యతలు నిర్వర్తిస్తూ పిల్లలు విద్యలో ఉన్నత శిఖరాలను ఆధిరోహించేలా ప్రోత్సహించిన డా. తేజస్విని తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.

Check Also

విద్యాసాగర్ పదవీ ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలిరండి…

– ఏపీఎన్జీజీవో నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ పిలుపు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి ఎన్జీజీఒ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *