Breaking News

నగరంలో రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రం (బ్లడ్ బ్యాంకు స్టోరేజ్ సెంటర్) ఏర్పాటు..

-రెడ్ క్రాస్ ద్వారా ఏడాదికి 12 వేలు యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యం ..
-ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సేకరించిన రక్తాన్నే రోగులకు వినియోగించాలి .
-జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏడాదికి 12 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించాలన్న లక్ష్యంతో జిల్లాలో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని రోగుల సౌకర్యార్ధం విజయవాడ సూర్యారావు పేటలో రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సేకరించిన రక్తాన్ని మాత్రమే రోగులకు వినియోగించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 65 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన సంచార వైద్య వాహనాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గాంధీ నగర్ లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనం నుండి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖను మరింత పటిష్ట పరచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు . తద్వారా రెడ్ క్రాస్ సేవలను రోగులకు చేరువ చేయాలన్నదే తన లక్ష్యం అన్నారు. జిల్లా వ్యాప్తంగా యూత్ రెడ్ క్రాస్ ను ప్రోత్సహించి ప్రతి కళాశాలలోనూ రక్తదాన శిబిరాలను నిర్వహించి ఏడాదికి సుమారు 12 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించానున్నామన్నారు . సేకరించిన రక్తంలో నెలకు 100 యూనిట్ల రక్తాన్ని గిరిజనులకు అట్టడుగునున్న పేద వర్గాలకు ఉచితంగా అందిస్తామన్నారు. నగరంలోని సూర్యారావు పేట ఏరియా లో అత్యధిక ప్రైవేట్ ఆసుపత్రులు పనిచేస్తున్నాయని వాటి సమీపంలో రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి రోగులకు అవసరమైన రక్తాన్ని అందుబాటులో ఉంచనున్నామన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు అవసమైన రక్తాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సేకరించిన రక్తాన్ని మాత్రమే వినియోగించేలా ఆదేశాలు చేస్తున్నామన్నారు. యూత్ రెడ్ క్రాస్ టాస్క్ ఫోర్స్ బృందాల ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలలో ప్రతి ఇంటిలోని సభ్యులకు హృద్రోగ లక్షణాలపై అవగాహన కల్పించి గుండెపోటును నివారించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర సంస్థ 65 లక్షల రూపాయల వ్యయంతో సంచార వైద్య వాహనాన్ని కొనుగోలు చేసి జిల్లాకు అందచేయడం జరిగిందనన్నారు . సంచార వైద్య వాహనం ద్వారా వైద్య బృందం జిల్లాలో పర్యటించి రోగులకు వైద్య సేవలు అందించడం తో పాటు దాతల నుండి రక్తాన్ని సేకరించడం జరుగుతుందన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటివరకు అనేక సేవ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు విపత్కర పరిస్థితులు సంభవించినపుడు తక్షణమే స్పందించి సేవలందించడం తో పాటు క్షయ వ్యాధి గ్రస్తులకు పౌష్టికాహారం అందించడం ఉచిత కంటి, దంత వైద్య శిబిరాలు నిర్వహణ ఉచిత మందుల పంపిణి చేయడం జరుగుతుందన్నారు. దసరా ఉత్సవాలు భవాని దీక్ష విరమణ కార్యక్రమాలలో రెడ్ క్రాస్ ద్వారా భక్తులకు సేవలందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.
కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డా. జి. సమరం, జనరల్ సెక్రటరీ డా. ఇళ్లా. రవి, మేనేజర్ సిహెచ్. శ్రీనివాసరావు, సూపర్ వైజర్ టి. సునీత, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *