దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త :
దుగ్గిరాల మండల కేంద్రము రైలుపేట లోని డాక్టర్ వైఎస్ఆర్ గారి విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం నాయకులు కేకే కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సంధర్బంగా రాష్ట్రంలో వైఎస్ జగన్ గారి నాయకత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని, ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల ఎంపీపీ దానబొయిన సంతోష రూపవాణి, దుగ్గిరాల గ్రామ సర్పంచ్ కుషి భాయ్, పెరుకలపూడి సర్పంచ్ గాంపల గంగాధర్ , నాయకులు కంభంపాటి క్రాంతి కుమార్, పార్టీ జిల్లా బిసి సెల్ అధ్యక్షులు దానబోయిన వెంకటేశ్వరరావు, దాసరి వీరయ్య, నుతలపాటి కేశవరావు , షేక్ జానీ బాషా , వడ్డేస్వరపు రజినీ కాంత్ , రత్నం , పిల్లి ధర్మరత్నం, నలుకుర్తి ఏసుపాదం, నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Tags Duggirala
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …