Breaking News

బొప్పాయి వ్యర్థాలు విషాలన్నింటినీ బయటకు పంపుతుంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :

ఉదయం మొట్టమొదటి ఆహారం గా బొప్పాయి ముక్కలు తింటే అది శరీరంలో ఉన్న వ్యర్థాలు విషాలన్నింటినీ బయటకు పంపుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా అవసరం. కనీసం గంట వరకూ వేరే ఆహారం తీసుకోకుండా ఉంటే జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. అరటిపండ్లు కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి.కానీ లేవగానే తినకూడదు. మధ్యాహ్నం… సాయంత్రం తినాలి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం. గుండెకి మంచిది. అలాగే కొబ్బరినీళ్ళు ఉదయాన్నే తాగితే ఎంతో బావుంటాం ! బలం పెరగడానికి ఖరీదైన బాదం పప్పు అక్కర్లేదు. రాత్రి వేరుశనగ గుండ్లు నానబెట్టి… ఉదయం మిక్సీలో వేసి…పాలు…అరటిపండ్లు తో కలిపి షేక్ చేసుకొని తాగితే అంతకన్నా ఇమ్యునిటీ బూస్టర్ ఉండదు. అలాగే నీళ్ళు ఎక్కువ తాగాలి. ఉదయం లేవగానే తేనె…నిమ్మరసం కలుపుకుని మూడు గ్లాసులు వేన్నీళ్ళు తాగితే…చీటికీ మాటికీ జలుబు… జ్వరం రావు. అలాగే నీళ్లు తాగేటప్పుడు కూర్చుని తాగాలి. నీళ్ళే కాదు ఏ ఆహారం… కాఫీ…టీ ఏదీ నిలబడి తీసుకోవడం కరెక్ట్ కాదు. అది శరీరం పై దుష్ప్రభావం చూపుతుంది. ఆహార పానీయాలని ఎంత పవిత్రంగా చూస్తే అవి అంత ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఏం తింటున్నాం అనేది ఎంత ముఖ్యమో…ఏ భావనతో తింటున్నామనేది అంతకంటే ముఖ్యం. ఈ నీరు…ఈ ఆహారం నాకు ప్రాణశక్తి ని ఇస్తున్నాయి అని అనుకుంటూ భోజనం చేస్తే…ఆ భోజనమే మనకు ఔషధం ఔతుంది. భోజనం తర్వాత కనీసం నాలుగు గంటలు ఏమీ తినకూడదు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు… కూరగాయలు… ప్రోటీన్లు ఉండే పెరుగు లాంటివి అధికంగా తింటే…ఎక్కువ సేపు ఆకలి అవదు. ఈ సమయంలో కొర్రలు…సజ్జలు అంటూ ప్రయోగాలు చేయకండి. అవి అలవాటు పడాలంటే టైం పడుతుంది. తక్కువ పాలిష్డ్ రైస్ కొనండి. లేదా కొద్దిగా దంపుడు బియ్యం మామూలు రైస్ తో కలిపి వండండి. విటమిన్ బి 12 లభిస్తుంది దంపుడు బియ్యం లో. చాలా మంది మాంసాహారం బలం అనుకుంటారు. శారీరక శ్రమ లేకుండా ఎక్కువగా మాంసాహారం తింటే సరిగ్గా అరగదు. కొలెస్ట్రాల్ పెరిగి ఉన్న ఇమ్యునిటీ పోతుంది. మాంసం జీర్ణం అవడానికి అధిక సమయం పడుతుంది. ఆ సమయంలో వైరస్…బ్యాక్టీరియా లు శరీరం లో ప్రవేశిస్తే…ఇంక వాటికి పండగే. అదే శాకాహారం త్వరగా జీర్ణం ఔతుంది కాబట్టి ఇమ్యునిటీ పెరుగుతుంది. గుర్తుంచుకోండి… ఇప్పుడు పీచుపదార్థాలు చాలా ముఖ్యం. అది పండ్లు కూరగాయల్లోనే దొరుకుతుంది. మాంసం తినకుండా ఉండలేనోళ్ళు పరిమాణం తగ్గించి…దాంతో పాటు కూరగాయలు… పండ్లు కూడా తినాలి మీకు తెలుసా ? పులి కూడా కొంచెం లేత గడ్డి తింటుంది…ఫైబర్ కోసం !

అదీ సంగతి !

మనకు కోవిడ్ గురించి ఏం తెలియకపోవచ్చు. శరీరాన్ని ఎలా ఆరోగ్యం గా…బలంగా…శక్తివంతంగా… ఆనందంగా ఉంచుకోవచ్చో తెలిస్తే చాలు. తెలియడం అంటే ఆచరించడం ! వీలున్న వాళ్ళు విలేజ్ లకి వచ్చేయండి. గాలి పీల్చుకొని బతికేయొచ్చు. ఇక్కడ ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. చాలా తక్కువ. పల్లెల్ని కలుషితం చేయమని కాదు నా భావన. ఆరోగ్యం గా ఉన్న వాళ్ళు వచ్చి ఊపిరి పీల్చుకోమని. ఏదైనా ఊరెళ్ళిన వాళ్ళు ఒక ఐదు రోజులు అందరికీ దూరంగా ఉండి…తర్వాత బయట వాళ్ళతో కలవడం ఉత్తమం ! నాకు తెలిసి కోవిడ్ మనల్ని చంపదు…కానీ కార్పోరేట్ హాస్పిటల్స్ చంపేస్తాయి ఖరీదైన బిల్స్ తో! కాబట్టి జాగ్రత్త వహించండి. చెట్ల మధ్య ఉంటే మన ఆరోగ్యం బావుంటుంది. ప్రభుత్వాలు ఈ ఖరీదైన చికిత్స లని బ్లాక్ మార్కెట్లని నియంత్రించాలి.

మీడియా ధైర్యాన్ని… వంటింటి చిట్కాలను బాగా ప్రమోట్ చేయాలి.

మేధావులు …విద్యావంతులు… అవగాహన ఉన్నోళ్ళు అందరికీ భరోసానివాలి.

అన్నింటికీ మించి మనంతట మనం ఈ మెడికల్ మాఫియా కి దూరంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండండి. ప్రక్రృతి కి దగ్గరగా ఉండండి. అప్పుడప్పుడు ఆవిరి పడుతూ…వేడి వేడి ఆహారం తింటూ ఆరోగ్యం గా ఉండండి.

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *